logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నర్సంపేట ఆర్టీసీ డిపో ఘటన బాధిత డ్రైవర్‌ను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

నర్సంపేట ఆర్టీసీ డిపో ఘటన బాధిత డ్రైవర్‌ను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.
    1
    వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు.
ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    1
    హనుమకొండ జిల్లా : 
కార్మికులను అడ్డుకున్న పోలీసులు..
హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    15 hrs ago
  • మహబూబాబాద్, ఏప్రిల్ __: నేటి సమాజంలో యువతలో పెరుగుతున్న డ్రగ్స్, మద్యం వినియోగం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మగ పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబాల పాత్ర, బాధ్యతలపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో యువతలో మత్తు పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, చదువు మరియు ఉద్యోగ ఒత్తిడి, పర్యవేక్షణ లోపం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా “స్టేటస్ సింబల్” భావనతో మగ పిల్లలు మద్యం, డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రారంభంలో అలవాటుగా మొదలయ్యే ఈ వినియోగం, తరువాత తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది యువత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం, కొత్త స్నేహితులపై దృష్టి పెట్టడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వంటి సంకేతాలను గుర్తించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం, భావోద్వేగంగా అండగా నిలవడం కీలకమని చెబుతున్నారు. అదేవిధంగా, పిల్లలను క్రీడలు, హాబీలు, నైపుణ్యాల అభివృద్ధి వైపు దారితీసేలా ప్రోత్సహించడం, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం, అవసరమైతే కౌన్సిలింగ్ సహాయం పొందడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను కేవలం కుటుంబ స్థాయిలో కాకుండా సమాజం మొత్తం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. యువత దేశ భవిష్యత్తు కావడంతో, వారిని మత్తు బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.
    1
    మహబూబాబాద్, ఏప్రిల్ __:
నేటి సమాజంలో యువతలో పెరుగుతున్న డ్రగ్స్, మద్యం వినియోగం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మగ పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబాల పాత్ర, బాధ్యతలపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో యువతలో మత్తు పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, చదువు మరియు ఉద్యోగ ఒత్తిడి, పర్యవేక్షణ లోపం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా “స్టేటస్ సింబల్” భావనతో మగ పిల్లలు మద్యం, డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.
ప్రారంభంలో అలవాటుగా మొదలయ్యే ఈ వినియోగం, తరువాత తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది యువత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం, కొత్త స్నేహితులపై దృష్టి పెట్టడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వంటి సంకేతాలను గుర్తించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం, భావోద్వేగంగా అండగా నిలవడం కీలకమని చెబుతున్నారు.
అదేవిధంగా, పిల్లలను క్రీడలు, హాబీలు, నైపుణ్యాల అభివృద్ధి వైపు దారితీసేలా ప్రోత్సహించడం, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం, అవసరమైతే కౌన్సిలింగ్ సహాయం పొందడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సమస్యను కేవలం కుటుంబ స్థాయిలో కాకుండా సమాజం మొత్తం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
యువత దేశ భవిష్యత్తు కావడంతో, వారిని మత్తు బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని సమాచారం. ఈ ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన శంకర్ గౌడ్‌ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నర్సంపేట డిపోలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని సమాచారం.
ఈ ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన శంకర్ గౌడ్‌ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో నర్సంపేట డిపోలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
    1
    సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.