Shuru
Apke Nagar Ki App…
సిద్దిపేట లో ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వాన......... సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
వేణు విలేకరి
సిద్దిపేట లో ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వాన......... సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
More news from తెలంగాణ and nearby areas
- సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.3
- Post by User4017 Budhiya Kan ke2
- బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.1
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు1
- మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.1
- హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.3