Shuru
Apke Nagar Ki App…
ఆదోనిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు
G.NAGENDRA
ఆదోనిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు
More news from తెలంగాణ and nearby areas
- కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.1
- బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- Post by ఉంగరాల కార్తీక్1
- విద్యార్థులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవగాహన ర్యాలీ..,ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదోనిలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మద్యానికి, ధూమపానానికి, గుట్కాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కుటుంబంలో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు.1
- బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జహీరాబాద్ లో ముమ్మరంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం1