గంగాధర మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అవగాహన సభ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అవగాహన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. సభలో ఎంపీడీవో డి. రాము, తహశీల్దార్ అంబటి రజిత ముఖ్యంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల ప్రయోజనాలు, అర్హతలు మరియు వాటిని ఎలా పొందాలనే అంశాలను స్పష్టంగా వివరించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వంశీ కృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారి డా. శ్వేత, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
గంగాధర మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అవగాహన సభ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అవగాహన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. సభలో ఎంపీడీవో డి. రాము, తహశీల్దార్ అంబటి రజిత ముఖ్యంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల ప్రయోజనాలు, అర్హతలు మరియు వాటిని ఎలా పొందాలనే అంశాలను స్పష్టంగా వివరించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వంశీ కృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారి డా. శ్వేత, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- Post by నీరటి మహేందర్1
- అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. "మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి" ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.3
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. ఆ వార్డులోని ఎంపీడీవో, తాసిల్దార్, రిజిస్ట్రేషన్ వెళ్లే రహదారి పక్కన 5 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి ప్రవాహం ఉండడంతో చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని కోరారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.2
- Post by నీరటి మహేందర్1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1