logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్టీఆర్ గృహాన్ని రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే రాజు.మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ప్రతి పేదవాడికీ ఎన్టీఆర్ సొంత ఇల్లు..... ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి.. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని జిల్లా అధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్, ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 16వ వార్డు హోంగార్డ్ కాలనీలో హోంగార్డ్ బాలు రాజు నిర్మించుకున్న ఎన్టీఆర్‌ గృహాన్ని ఎమ్మెల్యే రాజు మాజీ, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా గృహప్రవేశ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభిచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్, ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లు మాట్లాడుతూ:- బియమ్ ఏ వై, బి ఎల్ సి,అర్బన్ స్కీమ్ ద్వారా లబ్ధిదారుడు బాలరాజుకు లక్షల 2, 50 వేల రూపాయలతో ఎన్టీఆర్ గృహాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు.పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గత వైసీపీ పాలనలో పేదల ఇంటి కలను నిర్వీర్యం చేశారని అన్నారు. ఎన్టీఆర్ గృహాలకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే నాటి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నోట్లో మట్టి కొట్టారని వారు అని అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏడి శివకుమార్. ఏఈ నాగభూషణ్. మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్. మున్సిపల్ ఏఈ మురళి. పట్టణ అధ్యక్షుడు నాగరాజు. మండల కన్వీనర్ నాగరాజు.సుబ్బారెడ్డి. గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఏఈలు. వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
c3af0b37-73ef-4ace-b093-6149493c523b

ఎన్టీఆర్ గృహాన్ని రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే రాజు.మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ప్రతి పేదవాడికీ ఎన్టీఆర్ సొంత ఇల్లు..... ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి.. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని జిల్లా అధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్, ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 16వ వార్డు హోంగార్డ్ కాలనీలో హోంగార్డ్ బాలు రాజు నిర్మించుకున్న ఎన్టీఆర్‌ గృహాన్ని ఎమ్మెల్యే రాజు మాజీ, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా గృహప్రవేశ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభిచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, టిటిడి బోర్డు మెంబర్, ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లు మాట్లాడుతూ:- బియమ్ ఏ వై, బి ఎల్ సి,అర్బన్ స్కీమ్ ద్వారా లబ్ధిదారుడు బాలరాజుకు లక్షల 2, 50 వేల రూపాయలతో ఎన్టీఆర్ గృహాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు.పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గత వైసీపీ పాలనలో పేదల ఇంటి కలను నిర్వీర్యం చేశారని అన్నారు. ఎన్టీఆర్ గృహాలకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే నాటి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నోట్లో మట్టి కొట్టారని వారు అని అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏడి శివకుమార్. ఏఈ నాగభూషణ్. మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్. మున్సిపల్ ఏఈ మురళి. పట్టణ అధ్యక్షుడు నాగరాజు. మండల కన్వీనర్ నాగరాజు.సుబ్బారెడ్డి. గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఏఈలు. వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    1
    ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.
    1
    సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    2 hrs ago
  • *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.
    1
    *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప)  రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు*
*మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది*
ముద్దాయి పేరు: 
షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా.
నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 
25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో  కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో  జాతీయ రహదారి- 40 (కర్నూల్ -  కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం
అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము:
On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర.
Seizure:- 
AP39 VE 0499 పాల ట్యాంకర్.
Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి  కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది.
జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే  వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి,  అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
కె.రమణా రెడ్డి 
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 
మైదుకూరు అర్బన్ పీఎస్.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాష్ట్రంలో వార్డు వాలెంటీర్ల సేవలను పునరుద్దించి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 99 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన 3000 నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత వైకాపా పాలనలో ప్రజలకు సేవాలందించిన వాలంటీర్లకి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే 10,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చి వారిని నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారిని బజారులు పాలు చేయడం దుర్మార్గమన్నారు.
    1
    రాష్ట్రంలో వార్డు వాలెంటీర్ల సేవలను పునరుద్దించి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 99 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన 3000 నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత వైకాపా పాలనలో ప్రజలకు సేవాలందించిన వాలంటీర్లకి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే 10,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చి వారిని నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారిని బజారులు పాలు చేయడం దుర్మార్గమన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    1
    బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు.
కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు.
జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్.
2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543).
3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు.
4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి,
అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి,  జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్  అభినిందించారు.
పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    1
    30-03-2026
కర్నూల్ జిల్లా 
ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు 
*_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు...
అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు..
నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు..
అమరావతిలో ఒక శాశ్వత  భవనని కట్టలేదు  చంద్రబాబు అని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు....
ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు...
*_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు....
రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు....
నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు...
ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు..
😎TEAM_BCS🇸🇱
#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    1
    ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు.
అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.