logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుట్టెడు సమస్యలతో దుర్గం గ్రామం – రోడ్డు సౌకర్యం లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు దుర్గం గ్రామం లో మౌలిక వసతుల కొరతతో గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామిగూడా పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామానికి నేటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు లేకపోవడం వల్ల గ్రామస్థులు వైద్యం, విద్య, అత్యవసర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

11 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
11 hrs ago

పుట్టెడు సమస్యలతో దుర్గం గ్రామం – రోడ్డు సౌకర్యం లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు దుర్గం గ్రామం లో మౌలిక వసతుల కొరతతో గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామిగూడా పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామానికి నేటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు లేకపోవడం వల్ల గ్రామస్థులు వైద్యం, విద్య, అత్యవసర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మన్యం జిల్లా నగర పంచాయతీ పాలకొండలోని రెల్లివీధిలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈనెల 14న డీఎస్పీ ఆధ్వర్యంలో మెగా కార్డెన్ సెర్చ్ చేపడతున్నట్లు సీఐ ఏ.ప్రసాదరావు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్ఐ డి.వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మన్యం జిల్లా నగర పంచాయతీ పాలకొండలోని రెల్లివీధిలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈనెల 14న డీఎస్పీ ఆధ్వర్యంలో మెగా కార్డెన్ సెర్చ్ చేపడతున్నట్లు సీఐ ఏ.ప్రసాదరావు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్ఐ డి.వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    1
    ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ysrcp
    1
    ysrcp
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు .
పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Naresh Koppula
    5
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • baryal ground ఇబ్బంది పడుతున్నాము
    3
    baryal ground ఇబ్బంది పడుతున్నాము
    user_Arunkumar Nune
    Arunkumar Nune
    ఉంగుటూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    4
    వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్  శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Naresh Koppula
    4
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.