logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు – జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.

1 hr ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు – జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Naresh Koppula
    4
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో *జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,* అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్, సివిల్ సప్లై, గ్యాస్ డీలర్స్, విద్యాశాఖ, హాస్పటల్ సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా పై *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,* సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం (11) ఏజెన్సీల పరిధిలో 2,12131 గ్యాస్ కనెక్షన్లు కలవని, గతవారం రోజుల నుండి పైన తెలిపిన 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 13985 సిలిండర్ల వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని, డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు, అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, డిమాండ్ కనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని, తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న స్టాకును గమనిస్తూ ఉండాలని వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్* మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏట్టి పరిస్థితిలలో అలాంటి వార్తలను నమ్మ వద్దని తెలిపారు, ప్రభుత్వం సూచించిన ప్రకారం 25 రోజుల అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ తెలిపారు,
    1
    మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో *జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,* అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్, సివిల్ సప్లై, గ్యాస్ డీలర్స్, విద్యాశాఖ, హాస్పటల్ సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా పై  *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,* సమీక్ష సమావేశం నిర్వహించారు, 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం (11) ఏజెన్సీల పరిధిలో 2,12131 గ్యాస్ కనెక్షన్లు కలవని, గతవారం రోజుల నుండి పైన తెలిపిన 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 13985 సిలిండర్ల వినియోగదారులకు 
పంపిణీ చేయడం జరిగిందని,  డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు, అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, డిమాండ్ కనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని, తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న స్టాకును గమనిస్తూ ఉండాలని వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద  కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్* మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏట్టి పరిస్థితిలలో అలాంటి వార్తలను నమ్మ వద్దని తెలిపారు, ప్రభుత్వం సూచించిన ప్రకారం 25 రోజుల అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ తెలిపారు,
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
    1
    రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    1
    ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.
    1
    వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.
    1
    గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628  మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని  ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Naresh Koppula
    3
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో  చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో  తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.