logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త, పోలీసుల ఎదుట లొంగుబాటు... జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

4 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 hrs ago

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త, పోలీసుల ఎదుట లొంగుబాటు... జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
    1
    రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • వరంగల్ జిల్లా: ఆజంజహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ వెంకట్రామ కూడలి వద్ద కార్మికులు మరియు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2021 అక్టోబర్ 26న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం 134 మందికి ఇంటి స్థలాలు కేటాయించినట్లే మిగిలిన 318 మంది కార్మికులకు కూడా స్థలాలు ఇవ్వాలని వారు కోరారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి యశోద మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పక్కన పెట్టి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వరంగల్ ఆజంజహి మిల్లు కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, మిగిలి ఉన్న 318 మంది కార్మికులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ నిరసనతో కొంతసేపు వెంకట్రామ కూడలి ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్ధరించారు.
    4
    వరంగల్ జిల్లా: ఆజంజహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ వెంకట్రామ కూడలి వద్ద కార్మికులు మరియు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2021 అక్టోబర్ 26న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం 134 మందికి ఇంటి స్థలాలు కేటాయించినట్లే మిగిలిన 318 మంది కార్మికులకు కూడా స్థలాలు ఇవ్వాలని వారు కోరారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి యశోద మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పక్కన పెట్టి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వరంగల్ ఆజంజహి మిల్లు కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, మిగిలి ఉన్న 318 మంది కార్మికులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ నిరసనతో కొంతసేపు వెంకట్రామ కూడలి ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్ధరించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    22 hrs ago
  • గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    1
    గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. , సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
    2
    హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు.
, సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే   ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • కనుమరుగుతున్న నాటక రంగాన్ని 90 ఏళ్లుగా కాపాడుకుంటూ నేటికీ నాటక ప్రదర్శనలు ఇస్తున్న ఏకైక నాట్యమండలి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నీ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి. 1936లో ధర్మపురి పట్టణంలో మొట్టమొదటిసారి సతీ సావిత్రి నాటకాన్ని ప్రదర్శించి తమ నాటక రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుండి ప్రస్తుత 2026 సంవత్సరం వరకు 90 సంవత్సరాలుగా తమ నాటక కలను ప్రతి ఏటా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో చారిత్రక నాటకాలు... భక్తి నాటకాలు... సామాజిక నాటకాలు సుమారు 500 వరకు నాటక ప్రదర్శనలు ప్రదర్శించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 2026 బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని శేషప్ప కళావేదికపై సతి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. 90 ఏళ్లకు ముందు 90 ఏళ్ల తర్వాత ప్రదర్శించిన నాటకం సతీ సావిత్రి కావడం ఒక విశేషం అంటున్నారు కళాకారులు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 5 తరాలుగా కళాకారులను అందిస్తూ నాటక రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నాటక రంగం బహుశా లేదేమో అని ఈ కళాకారులు తెలుపుతున్నారు. ఇంతటి వయసు కలిగిన ఈ నాటక రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి అవార్డులు కళాకారులకు అందచేసి కలలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    3
    కనుమరుగుతున్న నాటక రంగాన్ని 90 ఏళ్లుగా కాపాడుకుంటూ నేటికీ నాటక ప్రదర్శనలు ఇస్తున్న ఏకైక నాట్యమండలి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నీ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి. 1936లో ధర్మపురి పట్టణంలో మొట్టమొదటిసారి సతీ సావిత్రి నాటకాన్ని ప్రదర్శించి తమ నాటక రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుండి ప్రస్తుత 2026 సంవత్సరం వరకు 90 సంవత్సరాలుగా తమ నాటక కలను ప్రతి ఏటా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఎన్నో చారిత్రక నాటకాలు... భక్తి నాటకాలు... సామాజిక నాటకాలు సుమారు 500 వరకు నాటక ప్రదర్శనలు ప్రదర్శించారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 2026 బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని శేషప్ప కళావేదికపై సతి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. 90 ఏళ్లకు ముందు 90 ఏళ్ల తర్వాత ప్రదర్శించిన నాటకం సతీ సావిత్రి కావడం ఒక విశేషం అంటున్నారు కళాకారులు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 5 తరాలుగా కళాకారులను అందిస్తూ నాటక రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నాటక రంగం బహుశా లేదేమో అని ఈ కళాకారులు తెలుపుతున్నారు. ఇంతటి వయసు కలిగిన ఈ నాటక రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి అవార్డులు కళాకారులకు అందచేసి కలలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    4
    వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్  శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    52 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.