Shuru
Apke Nagar Ki App…
నారాయణపూర్ రిజర్వాయర్ సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపిన గ్రామస్తులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
నారాయణపూర్ రిజర్వాయర్ సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపిన గ్రామస్తులు
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన పెనుగొండ అబినైజర్, పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక తులం బంగారు గొలుసు, 4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.3
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్ జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �1
- Post by Venu Gopal1
- గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1