Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు, జిల్లాలో హోటళ్లు మరియు రెస్టారెంట్లపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకుంటూ ఇప్పటికే దాదాపు ఇరవైకి పైగా సిలిండర్లను సీజ్ చేశారు. అక్రమంగా సిలిండర్లు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Venu Gopal
జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు, జిల్లాలో హోటళ్లు మరియు రెస్టారెంట్లపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకుంటూ ఇప్పటికే దాదాపు ఇరవైకి పైగా సిలిండర్లను సీజ్ చేశారు. అక్రమంగా సిలిండర్లు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కనుమరుగుతున్న నాటక రంగాన్ని 90 ఏళ్లుగా కాపాడుకుంటూ నేటికీ నాటక ప్రదర్శనలు ఇస్తున్న ఏకైక నాట్యమండలి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నీ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి. 1936లో ధర్మపురి పట్టణంలో మొట్టమొదటిసారి సతీ సావిత్రి నాటకాన్ని ప్రదర్శించి తమ నాటక రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుండి ప్రస్తుత 2026 సంవత్సరం వరకు 90 సంవత్సరాలుగా తమ నాటక కలను ప్రతి ఏటా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో చారిత్రక నాటకాలు... భక్తి నాటకాలు... సామాజిక నాటకాలు సుమారు 500 వరకు నాటక ప్రదర్శనలు ప్రదర్శించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 2026 బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని శేషప్ప కళావేదికపై సతి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. 90 ఏళ్లకు ముందు 90 ఏళ్ల తర్వాత ప్రదర్శించిన నాటకం సతీ సావిత్రి కావడం ఒక విశేషం అంటున్నారు కళాకారులు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 5 తరాలుగా కళాకారులను అందిస్తూ నాటక రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నాటక రంగం బహుశా లేదేమో అని ఈ కళాకారులు తెలుపుతున్నారు. ఇంతటి వయసు కలిగిన ఈ నాటక రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి అవార్డులు కళాకారులకు అందచేసి కలలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.3
- నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.1
- నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కె హరితకు వినతిపత్రం సమర్పించారు. సిఎస్సి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జీవో నెం.12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ క్లెయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని, లేబర్ కార్డుల రెన్యువల్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ నాయకులు బాలకిషన్, ధర్మాయి రవి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.1
- पुलिस ने वारंगल SR नगर में अपनी पत्नी अनीता की हत्या करने वाले पति राजू को गिरफ्तार कर लिया है। राजू शराबी था और उसकी पत्नी अनीता के बीच अक्सर झगड़े होते रहते थे। इसी वजह से राजू ने अपनी पत्नी की हत्या कर दी। CI जवाजी सुरेश ने बताया कि मृतका की बहन सुनीता की शिकायत पर केस दर्ज किया गया और आरोपी को हिरासत में ले लिया गया है।1
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.1
- జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. భజన ఎక్కాహం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పారాయణం, భక్త బృందం సభ్యులు అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యులు భజన, ఆధ్యాత్మిక పాటలు, భక్తి గీతాలను పాడుతున్నారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో రవికుమార్ జువెల్లరీ షాపులో చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి దొంగలు చోరీ కి పాల్పడ్డారు. లాకర్ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. లాకర్ తెరవకపోవడంతో 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్ళారు. క్లూస్ టీం తో పోలీసులు విచారణ చేపట్టారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.1