Shuru
Apke Nagar Ki App…
మెట్ పల్లి లో జువెల్లరీ షాప్ లో చోరీ...లాకర్ తెరిచేందుకు విఫలయత్నం. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో రవికుమార్ జువెల్లరీ షాపులో చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి దొంగలు చోరీ కి పాల్పడ్డారు. లాకర్ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. లాకర్ తెరవకపోవడంతో 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్ళారు. క్లూస్ టీం తో పోలీసులు విచారణ చేపట్టారు.
K.V.REDDY
మెట్ పల్లి లో జువెల్లరీ షాప్ లో చోరీ...లాకర్ తెరిచేందుకు విఫలయత్నం. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో రవికుమార్ జువెల్లరీ షాపులో చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి దొంగలు చోరీ కి పాల్పడ్డారు. లాకర్ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. లాకర్ తెరవకపోవడంతో 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్ళారు. క్లూస్ టీం తో పోలీసులు విచారణ చేపట్టారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.1
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- కనుమరుగుతున్న నాటక రంగాన్ని 90 ఏళ్లుగా కాపాడుకుంటూ నేటికీ నాటక ప్రదర్శనలు ఇస్తున్న ఏకైక నాట్యమండలి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నీ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి. 1936లో ధర్మపురి పట్టణంలో మొట్టమొదటిసారి సతీ సావిత్రి నాటకాన్ని ప్రదర్శించి తమ నాటక రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుండి ప్రస్తుత 2026 సంవత్సరం వరకు 90 సంవత్సరాలుగా తమ నాటక కలను ప్రతి ఏటా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో చారిత్రక నాటకాలు... భక్తి నాటకాలు... సామాజిక నాటకాలు సుమారు 500 వరకు నాటక ప్రదర్శనలు ప్రదర్శించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 2026 బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని శేషప్ప కళావేదికపై సతి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. 90 ఏళ్లకు ముందు 90 ఏళ్ల తర్వాత ప్రదర్శించిన నాటకం సతీ సావిత్రి కావడం ఒక విశేషం అంటున్నారు కళాకారులు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 5 తరాలుగా కళాకారులను అందిస్తూ నాటక రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నాటక రంగం బహుశా లేదేమో అని ఈ కళాకారులు తెలుపుతున్నారు. ఇంతటి వయసు కలిగిన ఈ నాటక రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి అవార్డులు కళాకారులకు అందచేసి కలలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.3
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. , సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.2
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1