logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

2 hrs ago
user_Gourinatha p.g
Gourinatha p.g
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు.
స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
    1
    నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    4 hrs ago
  • Post by KR NEWS 369
    2
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల  కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు  అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    56 min ago
  • ​కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ​గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన ​పెనుగొండ అబినైజర్, ​పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన ​గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, ​గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు తెలిపారు. ​నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ​ఒక తులం బంగారు గొలుసు, ​4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.
    3
    ​కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి  చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ​గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన
​పెనుగొండ అబినైజర్,
​పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన ​గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, ​గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు  తెలిపారు. ​నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ​ఒక తులం బంగారు గొలుసు, ​4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    52 min ago
  • Post by Solanke Ravi
    3
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. భజన ఎక్కాహం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పారాయణం, భక్త బృందం సభ్యులు అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యులు భజన, ఆధ్యాత్మిక పాటలు, భక్తి గీతాలను పాడుతున్నారు.
    1
    జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. భజన ఎక్కాహం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పారాయణం, భక్త బృందం సభ్యులు అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యులు భజన, ఆధ్యాత్మిక పాటలు, భక్తి గీతాలను పాడుతున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి మాట్లాడుతూ.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు,మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమని తప్పకుండా ఇండ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు పూర్తిగా దగ్దమైన జాదవ్ ప్రేమ్సింగ్ కి వ్యక్తిగతంగా రూ. 30 వేలు తక్షణ సహాయం అందజేశారు. అదేవిధంగా బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. వీరి వెంట అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి మాట్లాడుతూ.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు,మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమని తప్పకుండా ఇండ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు పూర్తిగా దగ్దమైన జాదవ్ ప్రేమ్సింగ్ కి వ్యక్తిగతంగా రూ. 30 వేలు తక్షణ సహాయం అందజేశారు. అదేవిధంగా బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. వీరి వెంట అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    23 hrs ago
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.