Shuru
Apke Nagar Ki App…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.
Krishna
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కె హరితకు వినతిపత్రం సమర్పించారు. సిఎస్సి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జీవో నెం.12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ క్లెయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని, లేబర్ కార్డుల రెన్యువల్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ నాయకులు బాలకిషన్, ధర్మాయి రవి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.1
- पुलिस ने वारंगल SR नगर में अपनी पत्नी अनीता की हत्या करने वाले पति राजू को गिरफ्तार कर लिया है। राजू शराबी था और उसकी पत्नी अनीता के बीच अक्सर झगड़े होते रहते थे। इसी वजह से राजू ने अपनी पत्नी की हत्या कर दी। CI जवाजी सुरेश ने बताया कि मृतका की बहन सुनीता की शिकायत पर केस दर्ज किया गया और आरोपी को हिरासत में ले लिया गया है।1
- గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్ జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �1
- సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామస్తులకు నిర్మల్ జిల్లా కొండాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగితా 21 మందికి తీవ్ర గాయాలవగా వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ని ఆదేశించారు. ఎవరు అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.2
- Post by Venu Gopal1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ పునఃప్రారంభమై ఏడేళ్లు గడిచినా తమను విధుల్లోకి తీసుకోలేదని శాశ్వత కార్మికులు తెలిపారు. సుమారు 200 మంది కార్మికులు ఇప్పటికీ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మెడికల్ పరీక్షలు పూర్తైనా నియామకాలు జరగలేదని వెల్లడించారు. వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కార్మికుల తరఫున విప్పులూరి శ్రీనివాస్ తెలిపారు.1