కరీంనగర్ జిల్లాలో నారాయణపూర్ గ్రామస్తులు ఆందోళన... ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లాలో నారాయణపూర్ గ్రామస్తులు ఆందోళన... ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్ జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �1
- Post by Venu Gopal1
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- కనుమరుగుతున్న నాటక రంగాన్ని 90 ఏళ్లుగా కాపాడుకుంటూ నేటికీ నాటక ప్రదర్శనలు ఇస్తున్న ఏకైక నాట్యమండలి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నీ శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి. 1936లో ధర్మపురి పట్టణంలో మొట్టమొదటిసారి సతీ సావిత్రి నాటకాన్ని ప్రదర్శించి తమ నాటక రంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటినుండి ప్రస్తుత 2026 సంవత్సరం వరకు 90 సంవత్సరాలుగా తమ నాటక కలను ప్రతి ఏటా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో చారిత్రక నాటకాలు... భక్తి నాటకాలు... సామాజిక నాటకాలు సుమారు 500 వరకు నాటక ప్రదర్శనలు ప్రదర్శించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి 2026 బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని శేషప్ప కళావేదికపై సతి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. 90 ఏళ్లకు ముందు 90 ఏళ్ల తర్వాత ప్రదర్శించిన నాటకం సతీ సావిత్రి కావడం ఒక విశేషం అంటున్నారు కళాకారులు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 5 తరాలుగా కళాకారులను అందిస్తూ నాటక రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న నాటక రంగం బహుశా లేదేమో అని ఈ కళాకారులు తెలుపుతున్నారు. ఇంతటి వయసు కలిగిన ఈ నాటక రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి అవార్డులు కళాకారులకు అందచేసి కలలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.3