నల్గొండలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్..పాల్గొన్న ముస్లిం సోదరులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.
నల్గొండలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్..పాల్గొన్న ముస్లిం సోదరులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.1
- ఫార్మా, ఐటి లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం1
- కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డులో రెండు మూడు నెలల నుంచి మురికి కాలువ తీయకపోవడంతో మురికి పేరుకుపోయి దుర్వాసన రావడం జరిగింది అలాగే ఇండ్లలోకి విష కీటకాలు దోమలు వస్తున్నాయని 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి కి వాట్సాప్ చేయగా వెంటనే స్పందించిన ఆయన కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో స్వయంగా వచ్చి దగ్గరుండి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు కాలనీవాసులు మాట్లాడుతూ ఉగాది. రంజాన్ మాసంలో మురికి కాల్వ సమస్య ఉందని చెప్పిన వెంబడే అట్టి సమస్యను తక్షణమే పరిష్కరించిన 20 వార్డ్ కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇందానగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణ్. కల్వకుర్తి మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు1
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. , సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.2
- హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి1
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1