Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Jtv9 News Network
హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
More news from తెలంగాణ and nearby areas
- కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డులో రెండు మూడు నెలల నుంచి మురికి కాలువ తీయకపోవడంతో మురికి పేరుకుపోయి దుర్వాసన రావడం జరిగింది అలాగే ఇండ్లలోకి విష కీటకాలు దోమలు వస్తున్నాయని 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి కి వాట్సాప్ చేయగా వెంటనే స్పందించిన ఆయన కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో స్వయంగా వచ్చి దగ్గరుండి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు కాలనీవాసులు మాట్లాడుతూ ఉగాది. రంజాన్ మాసంలో మురికి కాల్వ సమస్య ఉందని చెప్పిన వెంబడే అట్టి సమస్యను తక్షణమే పరిష్కరించిన 20 వార్డ్ కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇందానగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణ్. కల్వకుర్తి మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.1
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.1
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.1