భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా నుంచి మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు అందుబాటులోకి వస్తున్న నాలుగు ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీలు తీర్థయాత్రలకు వెళ్లాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. IRCTC ఆధ్వర్యంలో “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుంచి మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐఆర్సిటిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ ఈ వివరాలను వెల్లడించారు. దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగాలతో పాటు సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర, అయోధ్య–కాశీ–బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర, హరిద్వార్–మాతా వైష్ణోదేవి–రిషికేశ్ యాత్ర వంటి నాలుగు ప్రత్యేక ప్యాకేజీలు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస్సు సౌకర్యం, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, దేవాలయ దర్శనాలు, టూర్ ఎస్కార్ట్ సేవలు, ప్రయాణ బీమా వంటి అన్ని సౌకర్యాలు ఒకే ధరలో కల్పిస్తున్నామని చెప్పారు. అదనపు ఖర్చులు ఉండవని స్పష్టం చేశారు. ప్రతి రైల్లో 705 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుందని, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు సేవలందిస్తారని తెలిపారు. కోచ్‌కు సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్ టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. యాత్రకు ఆసక్తి ఉన్న భక్తులు ఇచ్చిన ఫోన్ నంబర్లకు సంప్రదించి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే సీట్లు నిర్ధారితమవుతాయని తెలిపారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కోడ్ ను అధికారులు ఎత్తివేశారు. రెండు వారాలు గా సాగిన మున్సి పోరు ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉండగా రామగుండం కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్, కరీంనగర్ కార్పోరేషన్ ను బిజేపి, సిరిసిల్ల జమ్మికుంట రాయికల్ మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. సోమవారం కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్ లు ప్రత్యేక సమావేశానికి హాజరై కౌన్సెలర్ గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే తోపాటు అధికారులు అభినందించారు.4
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో సినిమా హీరో అర్జున్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు1