logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేపే రాణిపేట గ్రామంలో తై బజార్ బహిరంగ వేలంపాట పరిసర గ్రామాల ప్రజలు ఈ వేళలో పాల్గొని సంత ను దక్కించుకోవాలి మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామపంచాయతీ 2026-27 సంవత్సరానికి గాను తై బజార్ వేలం రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు రూ.20,000 డిపాజిట్ చేయాలని, వేలం దక్కించుకున్న వారు 50% సొమ్ము తక్షణమే చెల్లించి, ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులు సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ తెలిపారు.

14 hrs ago
user_Ramu Waytunews
Ramu Waytunews
మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
14 hrs ago
5f39496b-55bc-4c71-a1d2-977cf2f85f69

రేపే రాణిపేట గ్రామంలో తై బజార్ బహిరంగ వేలంపాట పరిసర గ్రామాల ప్రజలు ఈ వేళలో పాల్గొని సంత ను దక్కించుకోవాలి మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామపంచాయతీ 2026-27 సంవత్సరానికి గాను తై బజార్ వేలం రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు రూ.20,000 డిపాజిట్ చేయాలని, వేలం దక్కించుకున్న వారు 50% సొమ్ము తక్షణమే చెల్లించి, ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులు సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    15 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    17 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    2
    తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు  మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
    1
    ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    1
    తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్!
చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్:
మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.