Shuru
Apke Nagar Ki App…
మడికొండలో 50 మంది యువత బీఆర్‌ఎస్‌లో చేరిక వరంగల్ :గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ మడికొండ గ్రామంలో సుమారు 50 మందికి పైగా యువత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ అనుచరులతో కలిసి చేరికయ్యారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బొల్లికొండ వినోద్, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
M D Azizuddin
మడికొండలో 50 మంది యువత బీఆర్‌ఎస్‌లో చేరిక వరంగల్ :గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ మడికొండ గ్రామంలో సుమారు 50 మందికి పైగా యువత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ అనుచరులతో కలిసి చేరికయ్యారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బొల్లికొండ వినోద్, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మగ్గిడి మహేందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు గ్రేటర్ వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మగ్గిడి మహేందర్ అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి కేఆర్ నాగరాజు అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మార్గం ప్రసాద్ ఇటీవల మరణించగా నేడు వారి నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు... ఎమ్మెల్యే గారి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...7
- ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.1
- కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సాంగ్స్...1
- జనగామ జిల్లా:పాలకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలతోనే తాను ఎమ్మెల్యేగా ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు ప్రజల తీర్పు మాత్రం నిజాయితీ వైపే నిలుస్తుందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ చేసే రాజకీయాలకు భయపడేది లేదని స్పష్టం చేస్తూ… న్యాయం ఎప్పుడూ భారత జాతీయ కాంగ్రెస్ వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికలకన్నా ఎక్కువగా కష్టపడి తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. వారి అంకితభావం, సమష్టి కృషే ఈ విజయానికి మూలకారణమని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన ప్రతి ఓటరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటూ సేవా భావంతో ముందుకు సాగుతామని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు.1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. అగంతకులు కోర్టులో మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బాంబు పేలుతుందని కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. వెంటనే ఏవో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులు న్యాయవాదులు వివిధ కేసులపై కోర్టుకు హాజరైన వారంతా భయంతో బయటికి వచ్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అగంతకులు కోర్టులో అలజడి సృష్టించేందుకే బెదిరింపు మెయిల్ చేశారని భావిస్తున్నారు. అగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కోర్టులో అలజడి సృష్టించడానికే ఫేక్ బాంబు బెదిరింపుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.4
- హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాజీ మంత్రి గుండె విజయ రామారావు 350 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైకిల్ ద్వారా పాఠశాలకు వెళ్లడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చదువులో చురుకుదనం పెరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల పాఠాలను శ్రద్ధగా విని మంచి మార్కులు సాధించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలని, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని, అప్పట్లో సైకిల్ లేక నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్నారు.1
- రైల్ కిందపడి యువకుడు ఆత్మహత్య మంగళవారం అర్ధరాత్రి 11:30 గంటల సమయమ లో గుర్తు తెలియని పురుషుడు (25) చింతలపల్లి ఎలుగూరు రైల్వే స్టేషన్ ల మధ్య డౌన్ లైన్ పై వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి ఆత్మహత్య. మృతుడి కుడి పక్క చాతి పై పుట్టుమచ్చ,ఎడమ చేతి పై ఆనంద్ అనే పేరు పచ్చబొట్టు ఉన్నది. మృతదేహం వరంగల్ MGM మార్చురీ కి తరలింపు. వరంగల్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు.6
- ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.1