logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ నర్సింలు రెండవ కుమార్తె రాగిని ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా, ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య నర్సింలును పరామర్శించారు. ఈ సందర్భంగా, టీజేయూ నేతలు నర్సింలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్నారి రాగిని మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్న వారు, నర్సింలు కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. యువత సెల్ ఫోన్లకు బానిసలై చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారని, క్షణికావేశంతో తమ ఉజ్వల భవిష్యత్తును మధ్యలోనే నాశనం చేసుకుంటూ ఎంతోమంది యువతీ యువకులు మరణిస్తున్నారని టీజేయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు పెద్దవారై వారికి ఆసరాగా నిలవాల్సిన సమయంలో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం కన్నవారికి ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో యువతీ యువకులు బాధ్యతాయుతంగా మెలగాలని వారు పిలుపునిచ్చారు.

4 hrs ago
user_Gousuddin Md
Gousuddin Md
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
4 hrs ago
be6e6e11-bf2e-408c-8220-01d83ed22fd9

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ నర్సింలు రెండవ కుమార్తె రాగిని ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా, ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య నర్సింలును పరామర్శించారు. ఈ సందర్భంగా, టీజేయూ నేతలు నర్సింలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్నారి రాగిని మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్న వారు, నర్సింలు కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. యువత సెల్ ఫోన్లకు బానిసలై చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారని, క్షణికావేశంతో తమ ఉజ్వల భవిష్యత్తును మధ్యలోనే నాశనం చేసుకుంటూ ఎంతోమంది యువతీ యువకులు మరణిస్తున్నారని టీజేయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు పెద్దవారై వారికి ఆసరాగా నిలవాల్సిన సమయంలో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం కన్నవారికి ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో యువతీ యువకులు బాధ్యతాయుతంగా మెలగాలని వారు పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    1
    బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    8 hrs ago
  • 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘాజీపూర్‌లోని పోలీస్ లైన్‌లో ఘాజీపూర్ పోలీసులు యోగాను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. ఇరాజ్ రాజా ఐపీఎస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు, ఆరోగ్యకరమైన జీవనం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించారు.
    1
    12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘాజీపూర్‌లోని పోలీస్ లైన్‌లో ఘాజీపూర్ పోలీసులు యోగాను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. ఇరాజ్ రాజా ఐపీఎస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు, ఆరోగ్యకరమైన జీవనం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించారు.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    2
    ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Financial Analyst కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర పోరాటాల అమరవీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సారుగారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని దోమడుగులొ ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో మందభాస్కర్ రెడ్డి, గడ్డం కాళేశ్వర్, కుమ్మరి వెంకటేష్, మరిగాని యాదగిరి, ఎస్.కే. గరీబ్, ఎస్.కే. రఫీ, దండు రాంచందర్, ఆటో శ్రీను నాయక్, ఎండి గౌస్ సహా మరెంతో మంది పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్ర పోరాటాల అమరవీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సారుగారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని దోమడుగులొ ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో మందభాస్కర్ రెడ్డి, గడ్డం కాళేశ్వర్, కుమ్మరి వెంకటేష్, మరిగాని యాదగిరి, ఎస్.కే. గరీబ్, ఎస్.కే. రఫీ, దండు రాంచందర్, ఆటో శ్రీను నాయక్, ఎండి గౌస్ సహా మరెంతో మంది పాల్గొన్నారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    5 hrs ago
  • ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    1
    ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు. "డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు.

"డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ మరియు కండక్టర్లు వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
    1
    కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ మరియు కండక్టర్లు వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ అగ్నిప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
    user_SANDEEEP K
    SANDEEEP K
    కుత్బుల్లాపూర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.