మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్‌లో "స్వచ్ఛదనం - పచ్చదనం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిద్దాం: సర్పంచ్ ఆలూరి సంపత్స్థలం: కోటపల్లికోటపల్లి మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్‌లో మంగళవారం "స్వచ్ఛదనం - పచ్చదనం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సర్పంచ్ ఆలూరి సంపత్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆలూరి సంపత్ మాట్లాడుతూ..."పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పచ్చదనం పెరిగితేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది. గ్రామంలోని ప్రతి పౌరుడు తన వంతుగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. గ్రామాలను పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి." అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:ఎంపీడీఓ (MPDO)సీఐ (CI), ఎస్ఐ (SI)ఫారెస్ట్ ఎస్ఐ, బీట్ ఆఫీసర్ (FBO)పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్‌లో "స్వచ్ఛదనం - పచ్చదనం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిద్దాం: సర్పంచ్ ఆలూరి సంపత్స్థలం: కోటపల్లికోటపల్లి మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్‌లో మంగళవారం "స్వచ్ఛదనం - పచ్చదనం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సర్పంచ్ ఆలూరి సంపత్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆలూరి సంపత్ మాట్లాడుతూ..."పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పచ్చదనం పెరిగితేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది. గ్రామంలోని ప్రతి పౌరుడు తన వంతుగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. గ్రామాలను పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి." అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:ఎంపీడీఓ (MPDO)సీఐ (CI), ఎస్ఐ (SI)ఫారెస్ట్ ఎస్ఐ, బీట్ ఆఫీసర్ (FBO)పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు.
- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు.... అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు .... ఎమ్మెల్యే గెలవక ముందు హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే కంపా సీసీఎఫ్ క్షితిజ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు4
- పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం మనిషి భవిష్యత్తుకు ఆధారం మొక్కలేనని, వాటిని కాపాడుకోవాలని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక. సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి. - రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి. - దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం. - కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత. - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. - ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి. - సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి. - కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది. - ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం. - చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”1