*సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం సాయంత్రం సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటి మట్టం మరింత పెరిగితే సారపాక–రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు ఎవరూ ఆ మార్గంలో ప్రయాణించకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం తూరుబాక –దుమ్ముగూడెం ప్రధాన రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఆ మార్గంపై ఇప్పటికే వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేసి రహదారిని మూసివేసినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రహదారి వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద నిరంతరం పోలీసు బందోబస్తు కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వరద నీటిలో ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
*సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం సాయంత్రం సారపాక–రెడ్డిపాలెం, తూర్పాక–దుమ్ముగూడెం ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటి మట్టం మరింత పెరిగితే సారపాక–రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారుల నుంచి వివరాలు
అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు ఎవరూ ఆ మార్గంలో ప్రయాణించకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం తూరుబాక –దుమ్ముగూడెం ప్రధాన రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఆ మార్గంపై ఇప్పటికే వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేసి రహదారిని మూసివేసినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
రహదారి వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద నిరంతరం పోలీసు బందోబస్తు కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వరద నీటిలో ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
- ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో సర్వే బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల సమస్యలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. తాళ్లగొమ్మూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు, ముగ్గురు ఉపాధ్యాయులు, 31 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు శాశ్వత ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో విజయకుమారి ఇన్‌చార్జి హెడ్‌మిస్ట్రెస్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇప్పటివరకు పాఠశాల యూనిఫాంలు అందలేదని, త్వరలో కొత్త యూనిఫాంలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు రాయల లక్ష్మి, మారం పుష్ప మాట్లాడుతూ తమకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది భవనాలు శిథిలావస్థలో ఉండటంతో వర్షాకాలంలో వర్షం పడుతున్నా అదే పరిస్థితుల్లో వంట చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోందన్నారు.కోడిగుడ్డుకు ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా, మార్కెట్ ధర రూ.9.50 ఉండటంతో ఒక్కో గుడ్డుపై రూ.3.50 తమ జేబు నుంచి భరించాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ప్రతి నెల సకాలంలో అందడం లేదని వాపోయారు.గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, పాఠశాలలో ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండటంతో అది అయిపోతే వెంటనే కొత్త సిలిండర్ అందడం లేదని, ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు కట్టెలు కూడా అందుబాటులో లేవని మధ్యాహ్న భోజన వర్కర్లు తెలిపారు.ఈ సర్వేలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.కే. అబీద, మండల కమిటీ సభ్యురాలు మరియమ్మ, సంఘం జిల్లా నాయకురాలు పాపినేని సరోజినీ ,మండల నాయకురాలు, కవులూరి నాగమణి ,మడకం లత, తదితరులు పాల్గొనడం జరిగింది3
- తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥 తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥1
- రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.1
- భారతదేశం కర్ణాటక తుమాకూరు జిల్లా : *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* జూలై 31 | షురూ న్యూస్ కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బంగారు నగల దుకాణంలో ఆభరణాలు కనిపించకపోవడంతో మొదట సిబ్బంది దొంగతనం జరిగిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేముందు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక ఒక్కోసారి ఒక్కో బంగారు ఉంగరం, చిన్న చిన్న ఆభరణాలను నోటితో పట్టుకుని తన బొరియలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సిబ్బంది ఎలుక బొరియను తవ్వి చూడగా అందులో 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు సహా సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే ఆభరణాలన్నీ తిరిగి దొరికాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు మెరిసే వస్తువులు, చిన్న పరిమాణంలో ఉండే వస్తువులను తమ బొరియల్లోకి తీసుకెళ్లే అలవాటు కొన్నిసార్లు చూపుతాయి. అవి వాటి విలువను తెలుసుకుని కాకుండా, సహజ ప్రవృత్తి కారణంగా ఇలా తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ ఘటన బంగారు దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. సీసీటీవీ లేకపోయి ఉంటే ఇది నిజమైన దొంగతనంగా భావించి దర్యాప్తు మరింత క్లిష్టంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. *— నిమ్మ నగంటి అనిల్ బాబు* * డోర్నకల్ రిపోర్టర్, షురూ న్యూస్*1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- తిరుమల సమాచారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *18-20 గంటల* సమయం పడుతుంది. 👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *3–5 గంటల* సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,063* 👉🏻 *25,565* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.81 కోట్లు* 👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.27 లక్షలు* 👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.53 లక్షలు* 👉🏻 నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,166*1
- కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢1
- కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....3