Shuru
Apke Nagar Ki App…
కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢
Degala samson
కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢
More news from తెలంగాణ and nearby areas
- పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు * వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్‌ఎస్ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్1
- రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.1
- భారతదేశం కర్ణాటక తుమాకూరు జిల్లా : *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* జూలై 31 | షురూ న్యూస్ కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బంగారు నగల దుకాణంలో ఆభరణాలు కనిపించకపోవడంతో మొదట సిబ్బంది దొంగతనం జరిగిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేముందు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక ఒక్కోసారి ఒక్కో బంగారు ఉంగరం, చిన్న చిన్న ఆభరణాలను నోటితో పట్టుకుని తన బొరియలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సిబ్బంది ఎలుక బొరియను తవ్వి చూడగా అందులో 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు సహా సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే ఆభరణాలన్నీ తిరిగి దొరికాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు మెరిసే వస్తువులు, చిన్న పరిమాణంలో ఉండే వస్తువులను తమ బొరియల్లోకి తీసుకెళ్లే అలవాటు కొన్నిసార్లు చూపుతాయి. అవి వాటి విలువను తెలుసుకుని కాకుండా, సహజ ప్రవృత్తి కారణంగా ఇలా తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ ఘటన బంగారు దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. సీసీటీవీ లేకపోయి ఉంటే ఇది నిజమైన దొంగతనంగా భావించి దర్యాప్తు మరింత క్లిష్టంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. *— నిమ్మ నగంటి అనిల్ బాబు* * డోర్నకల్ రిపోర్టర్, షురూ న్యూస్*1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢1
- ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో సర్వే బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల సమస్యలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. తాళ్లగొమ్మూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు, ముగ్గురు ఉపాధ్యాయులు, 31 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు శాశ్వత ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో విజయకుమారి ఇన్‌చార్జి హెడ్‌మిస్ట్రెస్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇప్పటివరకు పాఠశాల యూనిఫాంలు అందలేదని, త్వరలో కొత్త యూనిఫాంలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు రాయల లక్ష్మి, మారం పుష్ప మాట్లాడుతూ తమకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది భవనాలు శిథిలావస్థలో ఉండటంతో వర్షాకాలంలో వర్షం పడుతున్నా అదే పరిస్థితుల్లో వంట చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోందన్నారు.కోడిగుడ్డుకు ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా, మార్కెట్ ధర రూ.9.50 ఉండటంతో ఒక్కో గుడ్డుపై రూ.3.50 తమ జేబు నుంచి భరించాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ప్రతి నెల సకాలంలో అందడం లేదని వాపోయారు.గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, పాఠశాలలో ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండటంతో అది అయిపోతే వెంటనే కొత్త సిలిండర్ అందడం లేదని, ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు కట్టెలు కూడా అందుబాటులో లేవని మధ్యాహ్న భోజన వర్కర్లు తెలిపారు.ఈ సర్వేలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.కే. అబీద, మండల కమిటీ సభ్యురాలు మరియమ్మ, సంఘం జిల్లా నాయకురాలు పాపినేని సరోజినీ ,మండల నాయకురాలు, కవులూరి నాగమణి ,మడకం లత, తదితరులు పాల్గొనడం జరిగింది3
- గోదావరిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు చర్ల: మండలంలోని వీరాపురం వద్ద గోదావరిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో చిక్కుకున్న 60 మందిని అధికారులు జేసీబీల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఎంపీడీవో ఇదయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి తెప్పలతో గోదావరి దాటి వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చారు.1