logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పత్రికా ప్రకటన* తేదీ: 25-08-2026 *కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు బహుమతి: డీటీఓ శంకర్ నాయక్* *పత్రికా ప్రకటన* తేదీ: 25-08-2026 *కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు బహుమతి: డీటీఓ శంకర్ నాయక్* మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహ్-వీర్ (Good Samaritan) పథకం గురించి జిల్లా ప్రజలు తెలుసుకోవాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట (Golden Hour) ఎంతో కీలకమని, ఈ సమయంలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని రహ్-వీర్‌గా గుర్తిస్తారని తెలిపారు. అర్హత పొందిన రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని పేర్కొన్నారు. *పౌరులు ఏం చేయాలి?* రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నా, ప్రమాదాన్ని చూసినా పౌరులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలని శంకర్ నాయక్ సూచించారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తమ వివరాలను ఆస్పత్రిలో ఇవ్వాలని తెలిపారు. అక్కడి నుంచి సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, సహాయం చేసిన వ్యక్తి వివరాలతో పాటు ఏ ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించారనే సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా స్థాయి కమిటీ ద్వారా వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారని తెలిపారు. *రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?* మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 134(ఎ) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని *‘రహ్-వీర్’* గా పరిగణిస్తారని తెలిపారు. రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించడం, ప్రమాద సమయంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సామాన్య ప్రజలను ప్రోత్సహించడం అని శంకర్ నాయక్ వివరించారు. అలాగే బాధితులకు సహాయం చేసే పౌరులకు ఎలాంటి పోలీస్ లేదా చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించడం కూడా ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు. *సంవత్సరానికి ఐదు సార్లు అవకాశం* సంవత్సరానికి ఒక వ్యక్తికి (5) సార్లు మాత్రమే రహ్-వీర్ నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఇస్తారు అని శంకర్ నాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఒక వ్యక్తి సమయానికి స్పందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా, ఒక కుటుంబాన్ని విషాదం నుంచి రక్షించినవారవుతారని ఆయన అన్నారు. రహ్-వీర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీటీఓ శంకర్ నాయక్ పేర్కొన్నారు. *మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం*

14 hrs ago
user_మద్దెల బిక్షపతి
మద్దెల బిక్షపతి
Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
14 hrs ago
5a7ac23b-fb76-4971-bd6a-a7b7b8f22ee3

*పత్రికా ప్రకటన* తేదీ: 25-08-2026 *కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు బహుమతి: డీటీఓ శంకర్ నాయక్* *పత్రికా ప్రకటన* తేదీ: 25-08-2026 *కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు బహుమతి: డీటీఓ శంకర్ నాయక్* మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహ్-వీర్ (Good Samaritan) పథకం గురించి జిల్లా ప్రజలు తెలుసుకోవాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట (Golden Hour) ఎంతో కీలకమని, ఈ సమయంలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని రహ్-వీర్‌గా గుర్తిస్తారని తెలిపారు. అర్హత పొందిన రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని పేర్కొన్నారు. *పౌరులు ఏం చేయాలి?* రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నా, ప్రమాదాన్ని చూసినా పౌరులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలని శంకర్ నాయక్ సూచించారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తమ వివరాలను ఆస్పత్రిలో ఇవ్వాలని తెలిపారు. అక్కడి నుంచి సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, సహాయం చేసిన వ్యక్తి వివరాలతో పాటు ఏ ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించారనే సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా స్థాయి కమిటీ ద్వారా వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారని తెలిపారు. *రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?* మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 134(ఎ) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని *‘రహ్-వీర్’* గా పరిగణిస్తారని తెలిపారు. రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించడం, ప్రమాద సమయంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సామాన్య ప్రజలను ప్రోత్సహించడం అని శంకర్ నాయక్ వివరించారు. అలాగే బాధితులకు సహాయం చేసే పౌరులకు ఎలాంటి పోలీస్ లేదా చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించడం కూడా ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు. *సంవత్సరానికి ఐదు సార్లు అవకాశం* సంవత్సరానికి ఒక వ్యక్తికి (5) సార్లు మాత్రమే రహ్-వీర్ నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఇస్తారు అని శంకర్ నాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఒక వ్యక్తి సమయానికి స్పందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా, ఒక కుటుంబాన్ని విషాదం నుంచి రక్షించినవారవుతారని ఆయన అన్నారు. రహ్-వీర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీటీఓ శంకర్ నాయక్ పేర్కొన్నారు. *మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం*

More news from తెలంగాణ and nearby areas
  • పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.


ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    1
    సారు.. పింఛను ఇప్పించండి..?*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. 
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
*సెంటర్:- అశ్వారావుపేట*
*స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?*
*యాంకర్ వాయిస్:*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
*వాయిస్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది.
నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది.
*వాయిస్*
నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది.
ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది.
*వాయిస్*
కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు.
*వాయిస్*
నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది.
*వాయిస్ ఓవర్*
నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా
హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.
సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 min ago
  • స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    1
    స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి
హసన్‌పర్తి:
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • పండుగల వేళ శాంతికి పెద్ద పీట ముదిగొండలో శాంతి కమిటీ మీటింగ్ ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సీఐ మురళి కోరారు.ముదిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. డీజే సౌండ్స్, విగ్రహాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.ఎవరైనా శాంతికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    పండుగల వేళ శాంతికి పెద్ద పీట ముదిగొండలో శాంతి కమిటీ మీటింగ్

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సీఐ మురళి కోరారు.ముదిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. డీజే సౌండ్స్, విగ్రహాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.ఎవరైనా శాంతికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
    1
    జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు
జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    55 min ago
  • నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు...
తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను 
నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్,  సోల్తి సాంబయ్య గౌడ్,  సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.