రైతుల సాగునీటి కోసం కలింగదల్ ప్రాజెక్టు వద్ద జల హారతి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస నియోజకవర్గం మందస రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మందస మండలంలోని కళింగదళ్ ప్రాజెక్టు వద్ద పలాస శాసనసభ్యులు గౌతు శిరీష సోమవారం జలహారతి కార్యక్రమంలో పాల్గొని, ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కళింగదళ్ ప్రాజెక్టు నీటితో ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన శాలిన మాధవ రావు దాసరి తాతారావు లబ్బ రుద్రయ్య తమిరియా భాస్కర రావు రట్టి లింగ రాజు నవీన్ చంద్రిశేఖర్ ఈశ్వరరావు సంతోష్ పండా దేబాసిస్ పండా బాలకృష్ణ మాస్టారు సురేంద్ర మాస్టారు బాబురావు భీమారావు హడియా కృష్ణ ఇతర కూటమి నాయకులు స్థానిక నాయకులు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం1
- సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.1
- పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.1
- శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.1
- అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు1
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపoడి : కలెక్టర్ శ్రీకాకుళం : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణ పై ఆయన వారాంతపు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ్ 6,7,8 క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యంతరలేమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈనెల 22 మరియు 23వ తేదీలలో స్వీకరించిన ఫారాలు యొక్క వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సరవణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బిఎల్ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు1