నేత్రదానంతో ఇద్దరి జీవితాలను వెలుగులు నింపిన నేత్రదాత నామా సుబ్బయ్య ధర్మవరం శివానగర్ కి చెందిన కీ శే నామ సుబ్బయ్య (89)గారు 26-08-2026 వృద్ధాప్యం తో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు నేత్రధానం కి సహకరించగా జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి రాఘవేంద్ర గారు కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారుడు నామా వెంకటరమణ కోడలు కల్పన మనవళ్లు రాజేష్, రాకేష్ కుమార్తెలు కృష్ణవేణి, సునీత అల్లుళ్ళు వెంకటసుబ్బయ్య, సునీల్ బ్రిలియంట్ స్కూల్ శేషు, గ్రందే శ్రీనివాసులు,సేగు మురళి గారికి సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ సెక్రటరీ జూజారు రఘు,అల్డిని ప్రభాకర్ రెడ్డి గుద్దిటి ధనుంజయ బద్దెల కేశవ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు 9392323605,9666629841 9059017583,8247724335 9492323912,9703126122
నేత్రదానంతో ఇద్దరి జీవితాలను వెలుగులు నింపిన నేత్రదాత నామా సుబ్బయ్య ధర్మవరం శివానగర్ కి చెందిన కీ శే నామ సుబ్బయ్య (89)గారు 26-08-2026 వృద్ధాప్యం తో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు నేత్రధానం కి సహకరించగా జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి రాఘవేంద్ర గారు
కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారుడు నామా వెంకటరమణ కోడలు కల్పన మనవళ్లు రాజేష్, రాకేష్ కుమార్తెలు కృష్ణవేణి, సునీత అల్లుళ్ళు వెంకటసుబ్బయ్య, సునీల్ బ్రిలియంట్ స్కూల్ శేషు, గ్రందే శ్రీనివాసులు,సేగు మురళి గారికి సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ సెక్రటరీ జూజారు రఘు,అల్డిని ప్రభాకర్ రెడ్డి గుద్దిటి ధనుంజయ బద్దెల కేశవ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు 9392323605,9666629841 9059017583,8247724335 9492323912,9703126122
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.2
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.1