ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలి జనవరి 1నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాంల భాగంగా ప్రత్యేక తనిఖీల నిర్వహణ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశం అచ్చంపేట, జనవరి 08,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూలు జిల్లా వ్యాప్తంగా బాల కార్మి కుల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్’ ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురు వారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమీక్షా సమావేశం హాలు లో ఆయన తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కార్మిక, పోలీస్, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయం అత్యవసరమని సూచించారు. జిల్లాలోని హోటళ్లు, పరిశ్రమలు, లాడ్జీలు, ఇటుక బట్టీలు, వర్క్‌షాపులు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బాల కార్మికులు గుర్తిస్తే వెంటనే రక్షించి పునరావాసం కల్పించాలి అన్నారు. వీధి పిల్లలు కనిపిస్తే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాల కార్మికులను వినియోగిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే బడికి దూరమైన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, కుటుంబాలకు దూరంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులకు చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 33 కేసులు నమోదు కాగా, 28 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం నిర్వహణకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- భారత్ మాత కి జై 🇮🇳2
- సంగారెడ్డి పట్టణంలో శిశు గృహ, సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- బద్వేల్ నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని AP మీడియా ఫెడరేషన్ నియోజవర్గ అధ్యక్షుడు క్రిష్ణ కిషోర్ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు,మీడియా ప్రతినిధులకు ఏవైనా సమావేశాలు పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.1
- జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- రాబోవు మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ సత్తా చాటాలనీ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సూచించారు. శుక్రవారం మోత్కూరు మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని చెప్పారు. ఎన్నికలకు ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ కొంపముంచిన అ*క్రమ సంబంధం.. | : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు. B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో1