logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గొల్లప్రోలులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 58 బైక్‌లు స్వాధీనం... ​పిఠాపురం: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ నిర్వహించారు. ​కాకినాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం తెల్లవారుజామున 04:00 గంటల ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగప్ప చెరువు ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ముఖ్య వీధులు, అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ గాలించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు,నాటు సారా,అక్రమ మద్యం నిల్వలు మరియు బెల్ట్ షాపులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ​గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని మొత్తం 58 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అక్రమ మద్యం అమ్మకాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ, పిఠాపురం టౌన్ ఎస్ఐ లోకేష్, యు కొత్తపల్లి ఎస్సై వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

17 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Press advisory Pithapuram, Kakinada•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈ నెల 10న అరకులోయ లో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు అరకులోయ లో ఈ నెల 10న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదిక సిద్దమవుతుంది. సుమారు 1500 మంది కూర్చునే విధంగా రూఫ్ క్లోజ్డ్ వేదికను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేయిస్తున్నారు. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించడానికి 15 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
    1
    ఈ నెల 10న అరకులోయ లో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
అరకులోయ లో ఈ నెల 10న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదిక సిద్దమవుతుంది. సుమారు 1500 మంది కూర్చునే విధంగా రూఫ్ క్లోజ్డ్ వేదికను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేయిస్తున్నారు. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించడానికి 15 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    1
    కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు
కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది
విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    55 min ago
  • అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.
    4
    అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు.......
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు.
ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.