99 రోజుల కార్యాచరణపై సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ – ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని, సిట్టింగ్ సామర్థ్యాన్ని, భోజన ఏర్పాట్లకు కేటాయించిన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం సభా ప్రాంగణంలో సరిపడా సిట్టింగ్‌ను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే విధంగా సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలతో అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగా పరిశీలించి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన శిక్షణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, కార్యక్రమం నిర్వహణ కోసం ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు తెలిపారు. శిక్షణ శిబిరం వద్ద అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌తో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమర్థ వినియోగం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణ అమలు విధానం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య,డీపీఓ సుధీర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
99 రోజుల కార్యాచరణపై సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ – ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని, సిట్టింగ్ సామర్థ్యాన్ని,
భోజన ఏర్పాట్లకు కేటాయించిన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం సభా ప్రాంగణంలో సరిపడా సిట్టింగ్‌ను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే విధంగా సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలతో అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగా పరిశీలించి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత
శాఖల అధికారులకు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన శిక్షణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, కార్యక్రమం నిర్వహణ కోసం ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు తెలిపారు. శిక్షణ శిబిరం వద్ద అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌తో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది
అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమర్థ వినియోగం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణ అమలు విధానం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య,డీపీఓ సుధీర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- Post by Gift maker1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1