logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మానవత్వం చాటుకున్న పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వరంగల్ నుంచి మంథని వస్తున్న సందర్భంగా వెంకటాపూర్ క్రాసింగ్ వద్ద డివైడర్‌ను ఢీకొని గాయపడిన గుర్తుతెలియని వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్ గమనించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా బాధితులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఫోన్ సహకారంతో మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చించారు. ఆయన మానవత్వానికి స్థానికులు అభినందనలు తెలిపారు.

23 hrs ago
user_Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
Journalist కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
23 hrs ago
86f93422-88f6-4ed0-8427-de2dbfd3fc3f

మానవత్వం చాటుకున్న పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వరంగల్ నుంచి మంథని వస్తున్న సందర్భంగా వెంకటాపూర్ క్రాసింగ్ వద్ద డివైడర్‌ను ఢీకొని గాయపడిన గుర్తుతెలియని వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్ గమనించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా బాధితులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఫోన్ సహకారంతో మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చించారు. ఆయన మానవత్వానికి స్థానికులు అభినందనలు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    56 min ago
  • తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
    1
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో  మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి  శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.
    4
    శివ స్వాములు దీక్ష విరమణ శివరాత్రి సందర్భంగా 8 రోజులు  కాలినడకన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రం నుంచి ఈనెల ఏడో తారీఖున శ్రీశైలం కాలి నడకన బయల్దేరారు. స్వాములు చందాపూర్ బసవన్న గడ్డ దగ్గరికి వెళ్ళగానే వీరిని ఒక కుక్క వెంబడించడం జరిగింది. తన కుక్కపిల్లలను కూడా వదిలి ఆ శివ స్వాముల వెంబడి శ్రీశైలం వరకు అంటే స్నానం చేసే తను స్నానం చేస్తుంది ఇలా చివరికి వారితో పాటు ఆ శునకం శ్రీశైల దర్శనం చేసుకుంది. తిరిగి ప్రయాణంలో కూడా  వారి వెంటే వాహనం తీసుకొని దానిని చందాపూర్ లో వదిలేయడం జరిగింది.ఇది తెలిసిన వారందరూ అది ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ అని ఆశ్చర్యానికి,ఆనందానికి గురవుతున్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Emergency department Naspur, Mancherial•
    13 min ago
  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    2
    తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    9 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో సినిమా హీరో అర్జున్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు
    1
    జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో సినిమా హీరో అర్జున్  శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.