Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.1
- శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోఘనంగా గరుడ సేవ మండల కేంద్రమైన విడవలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతా లక్ష్మ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు సీతారాములకు గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక పూలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలంగి సేవ అలంకరణ వచ్చిన భక్తులను ఆకర్షించింది. ఈ అలంకరణలో స్వామి అమ్మవార్లను చూసిన భక్తులు ముగ్దులే మైమరిచినారు. ఈ పూలంగి సేవ కు ఉభయకర్తలుగా కీర్తిశేషులు మడపర్తి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు మంజుల వేణుగోపాల్ వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు.4
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...1
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- Post by Bondhu Suresh2