ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో త్రాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టరు డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మితో కలిసి ఎంఈఓలు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరపు ఫలితాల విశ్లేషణలో గణితం, సైన్స్, తెలుగు విషయాలలో విద్యార్థులు వెనుకబడినట్టు గమనించామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రీ-ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల్లో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో మహిళా సమాఖ్య సభ్యులు కూడా విద్యార్థుల విజయంలో భాగస్వాములు కావాలని, అవసరమైతే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు . సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్‌ను విఓఏ లు పర్యవేక్షించాలని సూచించారు. ఆకాంక్షిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రశ్నాపత్రాలు, పాఠ్యసామగ్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసి అందించాలని తెలిపారు. బాలికలతో పోలిస్తే బాలుర ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థిని సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని, అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేద కుటుంబాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన మరమ్మత్తులు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు . పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ముందే అన్ని ఉన్నత పాఠశాలల్లో త్రాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన వివరాలను నివేదికల రూపంలో సమర్పించాలని ఆదేశించారు. బాలికల మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఏవీ ఉండకూడదని స్పష్టం చేస్తూ త్రాగునీటి, మరుగుదొడ్ల మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణుల వివరాలు, వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధి/వృత్తి సమాచారంతో వీఓఏ లు సమగ్ర నివేదిక రూపొందించి సమర్పించాలని సూచించారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో త్రాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టరు డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మితో కలిసి ఎంఈఓలు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరపు ఫలితాల విశ్లేషణలో గణితం, సైన్స్, తెలుగు విషయాలలో విద్యార్థులు వెనుకబడినట్టు గమనించామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రీ-ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల్లో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో మహిళా సమాఖ్య సభ్యులు కూడా విద్యార్థుల విజయంలో భాగస్వాములు కావాలని, అవసరమైతే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు . సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్‌ను విఓఏ లు పర్యవేక్షించాలని సూచించారు. ఆకాంక్షిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రశ్నాపత్రాలు, పాఠ్యసామగ్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసి అందించాలని తెలిపారు. బాలికలతో పోలిస్తే
బాలుర ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థిని సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని, అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేద కుటుంబాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన మరమ్మత్తులు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు . పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ముందే అన్ని ఉన్నత
పాఠశాలల్లో త్రాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన వివరాలను నివేదికల రూపంలో సమర్పించాలని ఆదేశించారు. బాలికల మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఏవీ ఉండకూడదని స్పష్టం చేస్తూ త్రాగునీటి, మరుగుదొడ్ల మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణుల వివరాలు, వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధి/వృత్తి సమాచారంతో వీఓఏ లు సమగ్ర నివేదిక రూపొందించి సమర్పించాలని సూచించారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- మహారాష్ట్ర | సాతారా జిల్లా: సాతారా జిల్లాలోని దేరే గ్రామానికి చెందిన భారత సైనికుడు ప్రమోద్ పరశురాం జాధవ్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. ఆయన మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. హృదయాన్ని కలిచివేసే దృశ్యంలో… కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ప్రసవం అనంతరం స్ట్రెచర్‌పైనే ఉన్న ఆయన భార్య, తన వీర భర్తకు చివరి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తించింది. సరిహద్దుల్లో దేశ శాంతి కోసం ప్రాణాలర్పించే జవానుల త్యాగానికి ఇది మరో ఉదాహరణ. వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టి, కుటుంబాన్ని వదిలి, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే మన సైనికుల ధైర్యానికి ఈ ఘటన నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… “ఇది ప్రేమకథ కాదు – త్యాగగాథ. మనందరి శాంతికోసం తమ జీవితాలనే అర్పిస్తున్న జవానుల్ని మనం స్మరించుకోవాలి” అన్నారు. భారత సైన్యం మన గర్వం. మన రక్షణ కవచం. వీర అమర జవాన్ జాధవ్‌కు శతకోటి వందనాలు. వారి కుటుంబానికి దేశమంతా సెల్యూట్. 🙏🇮🇳1
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- వరంగల్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు పేపర్లు లీక్ అవుతున్నట్లు సిఐడి గుర్తించింది. తాజా విద్యా సంవత్సరంలో వరంగల్ అగ్రికల్చర్ కాలేజీకి చెందిన జూ.అసిస్టెంట్ కార్తీక్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి, విద్యార్థిని జ్యోతి ద్వారా ఈ చైన్ సిస్టమ్ నడిపించినట్లు తేలింది. ఈ లీకేజీ నెట్వర్క్ వరంగల్ నుంచి జగిత్యాల, అశ్వరావుపేట, రాజేంద్రనగర్ సహా పలు జిల్లాలకు విస్తరించడంతో లోతైన విచారణ కొనసాగుతోంది.1
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.1