logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రూ.పదివేల కనీస వేతనం చెల్లించాలి మధ్యాహ్నం భోజన కార్మికులకు రూ.పదివేల కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో బుధవారం రోజున లక్షెట్టిపేట పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఈఓకు వినతిపత్రం సమర్పించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యవసర సరుకుల ధరలను కూడా పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Gourinatha p.g
Gourinatha p.g
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
11 hrs ago
901c517e-6b78-45b1-b770-368a7cff1c39
29e3557d-a5cc-4f2d-9ad6-44d5e4ee4f43

రూ.పదివేల కనీస వేతనం చెల్లించాలి మధ్యాహ్నం భోజన కార్మికులకు రూ.పదివేల కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో బుధవారం రోజున లక్షెట్టిపేట పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఈఓకు వినతిపత్రం సమర్పించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యవసర సరుకుల ధరలను కూడా పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    1
    జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....
    1
    బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్.
ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు.
ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్..
రెండవ నిందితుడిగా  చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు..
ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...!
14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..!
మరికొద్ది సేపట్లో  ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు.
ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...!
....
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    1
    కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ
రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని భీంజి నాయక్ తండలో ‘కాంగ్రెస్ మొక్క’గా పిలిచే వయ్యారి భామ మొక్క బీభత్సంగా పెరుగుతోంది. ఇళ్ల చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో వేగంగా వ్యాపిస్తూ గ్రామస్తులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మొక్క వల్ల చర్మ అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గ్రామంలో వెంటనే ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి ఈ మొక్కలను పూర్తిగా తొలగించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని భీంజి నాయక్ తండలో ‘కాంగ్రెస్ మొక్క’గా పిలిచే వయ్యారి భామ మొక్క బీభత్సంగా పెరుగుతోంది. ఇళ్ల చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో వేగంగా వ్యాపిస్తూ గ్రామస్తులకు ఇబ్బందులు కలిగిస్తోంది.
ఈ మొక్క వల్ల చర్మ అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
గ్రామంలో వెంటనే ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి ఈ మొక్కలను పూర్తిగా తొలగించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Upendra
    Upendra
    Police Officer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.
    1
    కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 21వ వార్డు సభ్యురాలు దూసరి కృష్ణవేణి గైర్హాజరు కావడంపై బుధవారం స్థానిక హనుమాన్ ఆలయంలో శివ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఎన్నికల రోజున డబ్బులు తీసుకుని హాజరు కాలేదన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోనని స్పష్టం చేస్తూ, ఆరోపణలు ఆధారాలతో చేయాలని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.
తన విజయంలో భాగమైన 21వ వార్డు సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు నాయకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల హామీలను అమలు చేస్తానని తెలిపారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.