నిరుద్యోగ యువతకు సదవకాశం...అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలి.. ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం అధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో నిర్వహిస్తున్న బారి మెగా ఉద్యోగ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు సదవకాశం...అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలి.. ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం అధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో నిర్వహిస్తున్న బారి మెగా ఉద్యోగ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు విజయాలుగా మార్చుకోవాలి. సుమారు 300 వందలకు పైగా ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు ఈ మేళా లో ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, సేవలు, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీస్ ఇలా చాలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మేళాకు వచ్చే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యోగ మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖ రక్షణ కల్పిస్తుంది, ట్రాఫిక్ నియంత్రణ, రెగ్యులేశన్ కు పటిష్ట చర్యలు తీసుకున్నాం..కోదాడ బైపాస్ మీదుగా దుర్గాపుర్ క్రాస్ రోడ్డు నుండి కోదాడ పట్టణంలోకి రావాలి. పోలీసు సూచనలు, అధికారుల సూచనలు పాటించాలి. కోదాడ మెగా జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం ఉద్యోగ అవకాశాలు నేరుగా ఇంటర్వ్యూలు 250కి పైగా కంపెనీలు వేలాది ఉద్యోగ అవకాశాలు 19 సెప్టెంబర్ 2026 ఉదయం 8:00 గంటల నుంచి అర్హులైన అభ్యర్థులు నేడే నమోదు చేసుకోండి నమోదు కోసం లాగిన్ అవ్వండి లేదా ఇక్కడ స్కాన్ చేయండి వేదిక సెయింట్ జోసెఫ్, సీసీఆర్ విద్యానిలయం, కోదాడ, తెలంగాణ
నిరుద్యోగ యువతకు సదవకాశం...అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలి.. ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం అధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో నిర్వహిస్తున్న బారి మెగా ఉద్యోగ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు సదవకాశం...అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలి.. ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం అధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో నిర్వహిస్తున్న బారి మెగా ఉద్యోగ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు విజయాలుగా మార్చుకోవాలి. సుమారు 300 వందలకు పైగా ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు ఈ మేళా లో ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, సేవలు, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీస్ ఇలా చాలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మేళాకు వచ్చే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యోగ మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖ రక్షణ కల్పిస్తుంది, ట్రాఫిక్ నియంత్రణ, రెగ్యులేశన్ కు పటిష్ట చర్యలు తీసుకున్నాం..కోదాడ బైపాస్ మీదుగా దుర్గాపుర్ క్రాస్ రోడ్డు నుండి కోదాడ పట్టణంలోకి రావాలి. పోలీసు సూచనలు, అధికారుల సూచనలు పాటించాలి. కోదాడ మెగా జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం ఉద్యోగ అవకాశాలు నేరుగా ఇంటర్వ్యూలు 250కి పైగా కంపెనీలు వేలాది ఉద్యోగ అవకాశాలు 19 సెప్టెంబర్ 2026 ఉదయం 8:00 గంటల నుంచి అర్హులైన అభ్యర్థులు నేడే నమోదు చేసుకోండి నమోదు కోసం లాగిన్ అవ్వండి లేదా ఇక్కడ స్కాన్ చేయండి వేదిక సెయింట్ జోసెఫ్, సీసీఆర్ విద్యానిలయం, కోదాడ, తెలంగాణ
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ స్వాధీనం ఘట్‌కేసర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గడువు తీరిన ఫుడ్ కలర్, హాట్ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్ మిక్స్ పౌడర్, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో బేకరీ యజమాని షేక్ అక్బర్ (35), సూపర్‌వైజర్ **షేక్ నజీర్ బాషా (22)**ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు ఇద్దరినీ ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఆహార వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.3
- నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.1
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.1
- *_బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల‘బంగారు గణేశుడు’!_* *_ప్రత్యేక ఆకర్షణ:_* _వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది._ *_బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల‘బంగారు గణేశుడు’!_* *_ప్రత్యేక ఆకర్షణ:_* _వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది._ *_స్వర్ణ శోభ:_* _సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు._ *_కళా నైపుణ్యం:_* _అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది._ *_ప్రత్యేక ప్రేరణ:_* _ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా,తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు._ _ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది._1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.1