Shuru
Apke Nagar Ki App…
సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బిజెపి జిల్లా అధ్యక్షుడు...... ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు.మంగళవారం కొత్తూరులో నాయకులతో సమావేశమయ్యారు.అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. నాయకులుసమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
A.NAGI REDDY
సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బిజెపి జిల్లా అధ్యక్షుడు...... ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు.మంగళవారం కొత్తూరులో నాయకులతో సమావేశమయ్యారు.అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. నాయకులుసమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- త్రాగునీటిలో మురుగునీరు కలుషితం.... ఆందోళనలో గ్రామస్తులు.... మెళియాపుట్టి (M)మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి దుర్వాసన రావడంతో స్థానికులు పైపులను తవ్వి పరిశీలించగా మురుగునీరు కలిసినట్లు గుర్తించారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడంతో సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.2
- పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో మన్యం జిల్లా పాలకొండలో కొలువై ఉన్న శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం గర్భాలయ ముఖద్వారానికి ఒక భక్తుడు కొత్త ఏడుకొండలు ఇత్తడి ఇత్తడి రేకు తాపడం జరిగింది.కొత్త ఏడుకొండలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.1
- సంతకవిటి మండలం లో ఈదురు గాలి లో తో కూడిన వర్షం ప్రజలు అంత సూరక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచనలు సంతకవిటి మండలం లో మంగళవారం ఒక్కసారి గా వాతావరణం లో మార్పులు చోటు చేసికొని వర్షం పడింది.పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలుoత సురక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచించారు.1
- బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు1
- రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...! బుడా చైర్మన్ - తెంటు లక్ష్మునాయుడు..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.3
- నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.1
- విజయనగరం జిల్లా స్వచ్ఛత హే సేవ 2026 విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి.. విజయనగరం, సెప్టెంబరు 16: జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కార్యక్రమాల షెడ్యూల్ మరియు విధివిధానాలను వెల్లడించారు. *స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :* సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు. సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం. సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు. సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన. సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు. సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ. సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం. సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం. అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం. అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. *అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు:* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలి. ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు, డీపీవో మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీవో పీ. బాలాజీ తదితర అధికారులు, ఆన్లైన్ ద్వారా ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు, గీత కార్మిక సంఘం మండల నాయకులు, చేతి గుర్తుదారులు గౌరవాధ్యక్షుడు పురం అప్పారావు మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు దరఖాస్తులకు అవకాశం 18 తేదీ వరకు పొడిగించడం మంచి పరిణామం.. గజపతినగరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం జరిగినది ఇందులో పాల్గొన్నవారు డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు బి రాంబాబు కళ్ళు గీత కార్మిక సంఘం మండల నాయకులు ఎం నరసయ్య పాల్గొన్నారు ఈ పత్రిక సమావేశంలో చేతి వృత్తిదారుల గజపతినగరం నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పురం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 5వ తేదీన కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లు ఏడవ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్రామాలలో లోను పట్టణాలలో నున్న వార్డు సచివాలయాలలోనూ దరఖాస్తులు పెట్టవచ్చును అని ప్రభుత్వం ప్రకటించి పది రోజులు సమయం ఇచ్చినప్పటికీ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసిన వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పటికీ రెండు రోజులు అదనంగా అనగా 18వ తేదీ వరకు పొడిగించడం మంచి శుభ పరిణామం అయినప్పటికీ ఇంతకుముందే ఆయా చేతి వృత్తిదారులు అనగా కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకార కార్మికులు డప్పు కళాకారులు చెప్పులు తయారీదారుల ప్రతినిధులతోనూ సమావేశాలు మండలాల వారీగా ఏర్పాటు చేసి కార్మికులకు అవగాహన కల్పించే విధంగా గ్రామ సభల ద్వారా తెలియజేయవలసి ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రసారం ద్వారా ప్రకటించడం అర్హత గల పెన్షన్ దారులు అవగాహన లేక ఇంకా లక్షలాదిమంది రాష్ట్రంలో కానీ వేలాదిమంది జిల్లాలలో కానీ ఉన్నారు కనుక ఈనెల ఆఖరి వరకు పెన్షన్లకు అప్లై చేయడానికి సమయం ఇవ్వాలని పురం అప్పారావు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరి ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఎటువంటి సమస్యకైనా కొంత సమయము అంటే కొన్ని రోజులు అనగా వారం రోజులు 15 రోజులు నెల రోజులు ఇలా 90 రోజులు కడుపులో పరిష్కారం చేయవలసి ఉన్నది అదే విధంగా పెన్షన్లకు కూడా కనీసం 15 నుండి 30 రోజుల వరకు సమయం పొడిగిస్తే ఇంకా అర్హత గల వారందరూ పెన్షన్లు పొందగలరు అని అప్పారావు తెలిపిరి.1