logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని, తెలంగాణలో మహిళల అభ్యున్నతే పరమావధిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. పెబ్బేరు మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డితో కలిసి హాజరైన ఎమ్మెల్యే, గత నియంత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు సేవ చేసేందుకే తాను ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఫైల్‌పైనే మొదటి సంతకం చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. వనపర్తి నియోజకవర్గంకు సంబంధించి ఇప్పటివరకు రూ. 30 కోట్ల 29 లక్షలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని ఆయన తెలిపారు. రేషన్ కార్డులు లేక అవస్థలు పడుతున్న ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ కార్డులను అందజేస్తుందని, కేవలం వనపర్తి నియోజకవర్గంలోనే 37,500 కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసినట్లు వివరించారు. ఈ రేషన్ కార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఒక్కరు కూడా ధరించలేదని, కేవలం అవి వ్యవసాయ పొలాల్లో అడవి పందులు రాకుండా కట్టుకునేందుకే పనికి వచ్చాయని ఎద్దేవా చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు నాణ్యవంతంగా ఉండటంతో మహిళలు సంతోషంగా ధరించి వస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చి వారి కరెంటు కష్టాలు దూరం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్లుగా, ఆర్టీసీ బస్సులకు ఓనర్లుగా, సోలార్ ప్లాంట్లకు ఓనర్లుగా, ఇలా అనేక రకాలుగా మహిళలను చైతన్యవంతం చేస్తూ, వారి ఆర్థిక పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్లు, రైస్ మిల్లులు, గోదాముల సైతం మహిళల నిర్వహణతో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. నాడు మహిళల గురించి మాట్లాడేవారు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, ఇంట్లో కూతుర్ని ఇబ్బందులు పెట్టేవారు రాష్ట్రంలోని మహిళలను ఏ విధంగా మంచిగా చూస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి కళ్ళు మండుతున్నాయని, కుళ్ళుకొని చస్తున్నారని, అలాంటివారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలే బుద్ధి చెబుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_RK JOURNALIST
RK JOURNALIST
వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
2 hrs ago
aa6b4498-9d4b-4124-8937-ffbb3863dac3

మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని, తెలంగాణలో మహిళల అభ్యున్నతే పరమావధిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. పెబ్బేరు మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డితో కలిసి హాజరైన ఎమ్మెల్యే, గత నియంత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు సేవ చేసేందుకే తాను ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఫైల్‌పైనే మొదటి సంతకం చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. వనపర్తి నియోజకవర్గంకు సంబంధించి ఇప్పటివరకు రూ. 30 కోట్ల 29 లక్షలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని ఆయన తెలిపారు. రేషన్ కార్డులు లేక అవస్థలు పడుతున్న ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ కార్డులను అందజేస్తుందని, కేవలం వనపర్తి నియోజకవర్గంలోనే 37,500 కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసినట్లు వివరించారు. ఈ రేషన్ కార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఒక్కరు కూడా ధరించలేదని, కేవలం అవి వ్యవసాయ పొలాల్లో అడవి పందులు రాకుండా కట్టుకునేందుకే

3d268707-f186-439c-8667-f36e91fc4152

పనికి వచ్చాయని ఎద్దేవా చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలు నాణ్యవంతంగా ఉండటంతో మహిళలు సంతోషంగా ధరించి వస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చి వారి కరెంటు కష్టాలు దూరం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్లుగా, ఆర్టీసీ బస్సులకు ఓనర్లుగా, సోలార్ ప్లాంట్లకు ఓనర్లుగా, ఇలా అనేక రకాలుగా మహిళలను చైతన్యవంతం చేస్తూ, వారి ఆర్థిక పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్లు, రైస్ మిల్లులు, గోదాముల సైతం మహిళల నిర్వహణతో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. నాడు మహిళల గురించి మాట్లాడేవారు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, ఇంట్లో కూతుర్ని ఇబ్బందులు పెట్టేవారు రాష్ట్రంలోని మహిళలను ఏ విధంగా మంచిగా చూస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి కళ్ళు మండుతున్నాయని, కుళ్ళుకొని చస్తున్నారని, అలాంటివారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలే బుద్ధి చెబుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    1
    జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    5 hrs ago
  • కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    1
    ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    4 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    Adoni, Kurnool•
    13 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    7 hrs ago
  • మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    1
    మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.