పోస్ట్ మార్టం సౌకర్యం కల్పించాలని జిల్లా వైద్యా అధికారులకు సీపీఐఎంఎల్ వినతి అనేక ఏళ్లుగా మంజూరి అయ్యి ప్రజల సేవలో లో లేని పోస్ట్ మార్టమ్ సౌకర్యం కల్పించాలని ఆసుపత్రి లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కారం చేయాలనీ సీపీఐ ఎం ఎల్ లిబరేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యధికారులను కలిసి వినతి పత్రం ద్వారా వివరించారు.ఈ సందర్బంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య మాట్లాడుతూ అనేక ఏళ్లుగా పోస్టుమార్టం గది,దానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ మంజూరి అయ్యి ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు అందుబాటులో లేకుండపోయిందని అన్నారు. ఎక్విప్మెంట్స్ కూడా తుప్పుపట్టి పోయే ప్రమాదం వున్నదని తక్షణమే పోస్ట్ మార్టమ్ సౌకర్యం ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న హాస్పిటల్ పనుల వలన ఓపి రోగులను గంటల తరబడి ఎండలో నిలబెట్టి ఓపి చిట్టీలు ఇవ్వడం సరికాదని వారు జిల్లా వైద్యాధికారులైన డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వాణి, డిసి హెచ్ ఎస్ డాక్టర్ సంధ్య మరియు మెడికల్ సూపరింటేడెంట్ డాక్టర్ శ్రీనివాస్ లకు రాత పూర్వకంగా వివరించారు. రోగులకు అందిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ లు సకాలంలో అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే మొత్తం జిల్లా వ్యాపితంగా రిపోర్ట్ లు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతున్నాదని దాని లోపాలు త్వరలో సరి చేస్తామని సూచించారు జిల్లా వైద్యాధికారులు. పిహెచ్ సి. సిహేచ్ సి హాస్పిటల్ ను వేరు వేరు చేయాలనీ కోరగా కొత్త బిల్డింగ్ తధనంతరం విభజిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఓపి చిట్టీలు అందుంచలేకపోతున్నామని ప్రయివేట్ అప్పులు చేసి మరి ఓపి చిట్టిలు ప్రింటింగ్ చేయిస్తున్నామని అన్నారు. రోగులకు అవసరమైన నిధులు ఇవ్వలేని విషయం లో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కళింగరాజు, సుధాకర్ బాబు, కార్తీక్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.4
- మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌.𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏#𝐌𝐀𝐋𝐄][𝐁𝐀3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐀𝐍𝐀𝐌 𝐌𝐎𝐍𝐃𝐀-𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂][𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀-𝐒𝐓𝐀𝐓𝐄#𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃)4
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1