logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాథోడ్‌ బాపూరావు సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో 300 మంది చేరిక తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోథ్‌ నియోజకవర్గంలోని గెర్జామ్‌ గ్రామంలో సుమారు 300 మంది ప్రజలు పార్టీలో చేరారు. బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అబ్జర్వర్‌ రాథోడ్‌ బాపూరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోడ్‌ బాపూరావు మాట్లాడుతూ.. గెర్జామ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ప్రజల ఆదరణతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని విస్తరించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ షేక్‌ బిలాల్‌, మైనారిటీ చైర్మన్‌ ఫరిద్‌, ఎండీ ఆషిఫ్‌, షేక్‌ మహమ్మద్‌, షేక్‌ ముస్తఫా, జడ్పీటీసీ హరన్‌ మారుతీపటేల్‌, గ్రామ నాయకులు లచుపటేల్‌, కొట్నాక్‌ మహదు, పెద్ది రవి, మాజీ సర్పంచ్‌ సిదం తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
1 hr ago
79daf4a1-467d-46ac-86e2-7fb9790637b7

రాథోడ్‌ బాపూరావు సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో 300 మంది చేరిక తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోథ్‌ నియోజకవర్గంలోని గెర్జామ్‌ గ్రామంలో సుమారు 300 మంది ప్రజలు పార్టీలో చేరారు. బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అబ్జర్వర్‌ రాథోడ్‌ బాపూరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోడ్‌ బాపూరావు మాట్లాడుతూ.. గెర్జామ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ప్రజల ఆదరణతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని విస్తరించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ షేక్‌ బిలాల్‌, మైనారిటీ చైర్మన్‌ ఫరిద్‌, ఎండీ ఆషిఫ్‌, షేక్‌ మహమ్మద్‌, షేక్‌ ముస్తఫా, జడ్పీటీసీ హరన్‌ మారుతీపటేల్‌, గ్రామ నాయకులు లచుపటేల్‌, కొట్నాక్‌ మహదు, పెద్ది రవి, మాజీ సర్పంచ్‌ సిదం తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.
    1
    ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    25 min ago
  • మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం గ్రంథాలయ ప్రారంభోత్సవం ఆదిలాబాద్‌: తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం ఉదయం 9.30 గంటలకు గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు తోట శివ్వన్న, ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్‌ తెలిపారు. మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి జోగు రామన్న, బండారి అనూష సతీష్‌ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    1
    మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం గ్రంథాలయ ప్రారంభోత్సవం
ఆదిలాబాద్‌: తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం ఉదయం 9.30 గంటలకు గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు తోట శివ్వన్న, ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్‌ తెలిపారు. మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి జోగు రామన్న, బండారి అనూష సతీష్‌ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    43 min ago
  • ఆగస్టు 26, 2026_ఆదిలాబాదు: *అదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆగస్టు 26, 2026_ఆదిలాబాదు:

*అదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా*
పత్రిక ప్రకటన
కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder
    1
    pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన....... కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన.......
కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    1
    పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు
పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు.
విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.
క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు...
బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే  బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • సిరికొండ ఐఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడిగా జెల్ల సతీష్ నియామకం ఆదిలాబాద్‌: సిరికొండ మండల ఐఎన్‌టీయూసీ (ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) అధ్యక్షుడిగా జెల్ల సతీష్‌ నియమితులయ్యారు. జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మునిగేలా నర్సింగ్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా డీసీసీ కార్యాలయంలో ఆయనకు నియామక ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్‌రావు, నర్సింహాచారి, సిరికొండ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్‌, మైనారిటీ మండల చైర్మన్‌ ఎండీ రంజాన్‌, ఏఎంసీ డైరెక్టర్‌ చావాన్‌ ప్రకాష్‌, ఎండీ ముజీబ్‌, జిల్లా ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జీవన్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    1
    సిరికొండ ఐఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడిగా జెల్ల సతీష్ నియామకం
ఆదిలాబాద్‌: సిరికొండ మండల ఐఎన్‌టీయూసీ (ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) అధ్యక్షుడిగా జెల్ల సతీష్‌ నియమితులయ్యారు. జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మునిగేలా నర్సింగ్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా డీసీసీ కార్యాలయంలో ఆయనకు నియామక ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్‌రావు, నర్సింహాచారి, సిరికొండ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్‌, మైనారిటీ మండల చైర్మన్‌ ఎండీ రంజాన్‌, ఏఎంసీ డైరెక్టర్‌ చావాన్‌ ప్రకాష్‌, ఎండీ ముజీబ్‌, జిల్లా ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జీవన్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.