logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనపర్తి అభివృద్ధికి రూ.39.40 కోట్ల నిధులు రహదారులు, బ్రిడ్జిలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలకు భారీగా కేటాయింపులు పుష్కరాల నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి అభివృద్ధికి రూ.39.40 కోట్ల నిధులు రహదారులు, బ్రిడ్జిలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలకు భారీగా కేటాయింపులు పుష్కరాల నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి: అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మొత్తం రూ.39.40 కోట్ల నిధులు మంజూరు చేసిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.5 కోట్లతో పలు రహదారుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. తొస్సిపూడి నుంచి కొంకుదురు వరకు బుడతలమామిడి మీదుగా సూరారెడ్డి నర్సింగ్‌ హైస్కూల్‌–కాలువగట్టు వరకు తారు రోడ్డుకు రూ.2 కోట్లు, వడిశలేరు నుంచి తూర్పుగొనగూడెం వరకు బీటీ రోడ్డుకు రూ.2 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దుప్పలపూడి–కొత్తూరు రహదారికి రూ.70 లక్షలు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పులగుర్త వరకు గతంలో చేపట్టిన పనుల కొనసాగింపునకు రూ.35 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. సోమేశ్వరం–రాజానగరం రహదారికి రూ.10 కోట్లు సోమేశ్వరం–రాజానగరం రహదారిలో రాయవరం నుంచి ఎస్టీ రాజాపురం వరకు, రాజానగరాన్ని కలిపే ఏడీపీ రోడ్డు వరకు అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. వాస్తవానికి ఈ పనులకు రూ.15 కోట్లను ప్రతిపాదించామని, ప్రస్తుతం రూ.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. మిగిలిన రూ.5 కోట్లను కూడా మంజూరు చేయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. కెనాల్‌ రోడ్డుకు రూ.11.30 కోట్లు కాకినాడ–రాజమండ్రి కెనాల్‌ రోడ్డులో అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బలభద్రపురం నుంచి అనపర్తి వరకు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే అనపర్తి నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.6.30 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి వెళ్లే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా ఈ నిధులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పనులకు రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన కృషి కూడా ఉందన్నారు. బలభద్రపురం బ్రిడ్జికి రూ.2.50 కోట్లు బలభద్రపురంలో కాకినాడ–రాజమండ్రి కెనాల్‌ రోడ్డు, సోమేశ్వరం–రాజానగరం రహదారులను కలిపే పాత బ్రిడ్జి బ్రిటిష్‌ కాలంలో నిర్మించబడిందని, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని నల్లమిల్లి తెలిపారు. ఈ బ్రిడ్జి అభివృద్ధి కోసం రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యే దశలో ఉన్నాయని, నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. అనపర్తికి కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అనపర్తి మండలంలో మరో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడానికి రూ.4.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. దుప్పలపూడి సబ్‌స్టేషన్‌పై అధికంగా లోడ్‌ ఉండటం, అనపర్తి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో అదనపు సబ్‌స్టేషన్‌ అవసరమైందన్నారు. కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో విద్యుత్‌ లోడ్‌ షేరింగ్‌ మెరుగుపడి, తక్కువ వోల్టేజ్‌ సమస్యలు తగ్గడంతో పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ పనులకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సహకరించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెడపర్తి రేవు రోడ్డుకు కూడా అభివృద్ధి ప్రతిపాదన నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అనపర్తి నుంచి పెడపర్తి రేవు వరకు ఉన్న రహదారి మాత్రం పూర్తిస్థాయి అభివృద్ధికి నోచుకోలేదని నల్లమిల్లి తెలిపారు. ఇప్పటివరకు ఈ రోడ్డుకు మరమ్మతులు మాత్రమే చేపట్టామని, శాశ్వతంగా అభివృద్ధి చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డికి ప్రతిపాదనలు అందజేశామని చెప్పారు. ఈ రహదారికి కూడా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తే నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రధాన రహదారుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటికే సుమారు 80 శాతం బీటీ రోడ్లను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు ప్రారంభం ఎస్‌ఏఎస్‌కే ద్వారా మంజూరైన కొన్ని రహదారి పనులు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో ఉన్నందున కొంత ఆలస్యం జరుగుతోందని, ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మిగిలిన రహదారులను కూడా దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న వీఎంజీ రామ్‌జీ కార్యక్రమంలో మరికొన్ని రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు ఉపయోగపడే పుంత రోడ్ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు అనపర్తి నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి నిధులు మంజూరు కావడానికి సహకరించిన ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Ashok
Ashok
Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
123ffd11-8f20-4e24-8e09-65a7031c2af6

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.
    1
    కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు 
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని  తెలిపారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.
    1
    సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు
అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు 
లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల 
భారతరత్న మదర్ థెరిస్సా 
విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 
116 వ జయంతి వేడుకల
ను ఘనముగా నిర్వహించా 
రు. ఈ కార్యక్రమం లో సంస్థ 
అధ్యక్షులు బల్లా నాగభూష
ణము మదర్ థెరిస్సా విగ్ర
హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా 
నివాళి లర్పించారు.విద్యా
ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు
తూ మదర్ థెరిస్సా గారు 
భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి 
గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి 
చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత
రత్న పురస్కారాన్ని ఇచ్చి 
గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ
సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి
యని, ప్రార్ధించే పెదవులక
న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి
తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని 
అటువంటి గొప్ప మహనీ
య వ్యక్తి 116 వ జన్మదినం 
సందర్భముగా వారికి ఘన 
నివాళులు అర్పించుకోవడం 
ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు 
రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి 
శ్రీరాములు భవన్ చైర్మన్ 
పిరాట్ల నరసింహ మూర్తి, 
జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా
రు.
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    4
    రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ....
రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్‌ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్‌, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II
    1
    *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II 
*అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II
    user_Krishna Kasturi
    Krishna Kasturi
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    1
    అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........
మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    4
    గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    4
    ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’  సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు
అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం  చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 237896
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.