100కిలోల తలంబ్రాలు తీసుకొచ్చిన రామకోటి కృషి అభినందనీయం ● ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ● రామకోటి రామరాజు రామభక్తి అమోఘం ● మహిమాన్వితమైనవి భద్రాచల తలంబ్రాలు ● కోటి తలంబ్రాల దీక్ష భక్తులందరికి పంపిణి గజ్వేల్ నియోజకవర్గం, ఏప్రిల్ 16 (ప్రజా ప్రతిభ): భద్రాచల సీతారాముల కళ్యానానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలను క్వింటల్లా కొద్ది అందించి తిరిగి ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి భక్తులకు ఉచితంగా అందజేసి రామభక్తిని చాటుకుంటున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. గురువారం నాడు భద్రాచలం నుండి వచ్చిన 100కిలోల ముత్యాల తలంబ్రాలకు స్వాగతం పలికారు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏ సంస్థకు ఇవ్వని 100కిలోల తలంబ్రాలు రామకోటి రామరాజు భక్తికి మెచ్చి అందుజేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. గ్రామ, గ్రామాన గోటితో వడ్లను ఓలిపించి భద్రాచలం అందించి మరల తలంబ్రాలు తీసుకొచ్చి వారికి అందించడం అనేది శ్రమతో కూడుకున్న పని ఐన భక్తితో రామకోటి రామరాజు చేయడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ భద్రాచల దేవస్థానం అపర రామదాసుగా గుర్తించిన భక్తుడు రామకోటి రామరాజు. నిరంతరం రాముని సేవలో ఉండడం, భద్రాచలం నుండి 100కిలోల తలంబ్రాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అంతా తిరిగి అందించడం అభినందనీయం అన్నారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామనామం అమోగమైనదన్నారు. 100కిలోల తలంబ్రాలు భద్రాచల దేవస్థానం రామకోటి రామరాజుకు అందించడం వాటిని ఇక్కడికి తీసుకొచ్చి లక్షల మందికి అందించడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పాల్గొన్నారు.

- భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది: 1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్) ৪. ఎం,ఏ ( యోగ) 9. ఎంఎసత ఎం 10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం) 11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness1
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.2
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1