Shuru
Apke Nagar Ki App…
ఆన్‌లైన్ లొ పరిచయం.. మోసం.. ఆత్మహత్య.. ఫిర్యాదు.. కేసునమోదు పటాన్‌చెరు పరిధిలో కీర్తి షైనీ అనే వివాహిత ఆగస్టు 26న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన కోల్‌కతాకు చెందిన ముంతాజ్-ఉల్-రెహమాన్ వల్లే తన భార్య చనిపోయిందని భర్త సూరజ్ షైనీ ఆరోపించాడు. మృతికి ముందు ఆమె తన మొబైల్‌లో రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో ముంతాజ్-ఉల్-రెహమాన్ పేరు ప్రస్తావించినట్లు భర్త పేర్కొన్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
MUKKAGALLA YADANNA
ఆన్‌లైన్ లొ పరిచయం.. మోసం.. ఆత్మహత్య.. ఫిర్యాదు.. కేసునమోదు పటాన్‌చెరు పరిధిలో కీర్తి షైనీ అనే వివాహిత ఆగస్టు 26న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన కోల్‌కతాకు చెందిన ముంతాజ్-ఉల్-రెహమాన్ వల్లే తన భార్య చనిపోయిందని భర్త సూరజ్ షైనీ ఆరోపించాడు. మృతికి ముందు ఆమె తన మొబైల్‌లో రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో ముంతాజ్-ఉల్-రెహమాన్ పేరు ప్రస్తావించినట్లు భర్త పేర్కొన్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
More news from తెలంగాణ and nearby areas
- మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- శ్రావణ పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు శ్రావణ పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బ్రాహ్మణ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు శలాక రాజేశ్వర శర్మ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. శ్రావణ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం లేకపోవడంతో గ్రహణ దోషాలు వర్తించవని తెలిపారు. అందువల్ల గ్రహణానికి సంబంధించిన ఆచారాలు, నియమాలను పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చంద్రగ్రహణం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.1
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెల్లడించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4