బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతలో మరోసారి తాయ్ బజారీ వసూళ్ల పేరుతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గ్రామాల నుంచి కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులు, వ్యాపారుల వాహనాలను రోడ్డుపైనే ఆపి వసూళ్లు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పలుమార్లు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వసూళ్లు చేస్తున్న సిబ్బంది అతని సూచనలను పట్టించుకోకుండా ప్రధాన రహదారిపైనే తమ వసూళ్లను కొనసాగించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతి ఆదివారం సంత రోజున ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ను మున్సిపాలిటీ ఇచ్చినందున దాని అమలు, పర్యవేక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి వసూళ్లు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పుడు, దీనికి బాధ్యత ఎవరిది? చట్టం సాధారణ ప్రజలకేనా? లేక టెండర్ పొందిన వారూ చట్టాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా పరిపాలన, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ప్రధాన రహదారిపై వసూళ్లను నిలిపివేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతలో మరోసారి తాయ్ బజారీ వసూళ్ల పేరుతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గ్రామాల నుంచి కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులు, వ్యాపారుల వాహనాలను రోడ్డుపైనే ఆపి వసూళ్లు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పలుమార్లు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వసూళ్లు చేస్తున్న సిబ్బంది అతని సూచనలను పట్టించుకోకుండా ప్రధాన రహదారిపైనే తమ వసూళ్లను కొనసాగించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతి ఆదివారం సంత రోజున ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ను మున్సిపాలిటీ ఇచ్చినందున దాని అమలు, పర్యవేక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి వసూళ్లు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పుడు, దీనికి బాధ్యత ఎవరిది? చట్టం సాధారణ ప్రజలకేనా? లేక టెండర్ పొందిన వారూ చట్టాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా పరిపాలన, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ప్రధాన రహదారిపై వసూళ్లను నిలిపివేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతలో మరోసారి తాయ్ బజారీ వసూళ్ల పేరుతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గ్రామాల నుంచి కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులు, వ్యాపారుల వాహనాలను రోడ్డుపైనే ఆపి వసూళ్లు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పలుమార్లు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వసూళ్లు చేస్తున్న సిబ్బంది అతని సూచనలను పట్టించుకోకుండా ప్రధాన రహదారిపైనే తమ వసూళ్లను కొనసాగించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతి ఆదివారం సంత రోజున ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ను మున్సిపాలిటీ ఇచ్చినందున దాని అమలు, పర్యవేక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి వసూళ్లు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పుడు, దీనికి బాధ్యత ఎవరిది? చట్టం సాధారణ ప్రజలకేనా? లేక టెండర్ పొందిన వారూ చట్టాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా పరిపాలన, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ప్రధాన రహదారిపై వసూళ్లను నిలిపివేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన రాజగోపురం తొలగింపు పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గర్భగుడి పరిసరాలు మరియు పాత గోపురాల కూల్చివేత పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు, సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. ఈ నిర్మాణ పనుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్, పద్మ ప్రియ దంపతులు సుమారు 31 కోట్ల రూపాయలకు పైగా సొంత నిధులతో అమ్మవారి ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత, రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు ₹225 కోట్ల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా బాసర క్షేత్రం మరింత అభివృద్ధి పథంలోకి అడుగులు వేయనుంది. ఈ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్ నిరంతరం అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు అందిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా బోధన్ బెల్లాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశం సుజాత పోరాటం చేపట్టారు. గ్రామంలో పర్యటించిన ఆమెతో స్థానిక మహిళలు తమ ఆవేదనను పంచుకున్నారు. తమ ఊరిలో బెల్ట్ షాపులు అస్సలు ఉండకూడదని వారు సుజాతకు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని, యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారని మహిళలు ఆరోపించారు. కిరాణా షాపుల పేర్లు చెప్పుకుంటూ అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, యువకులు ఎక్కడబడితే అక్కడ తాగుతూ తిరుగుతుండటంతో దొంగతనాలు పెరిగిపోయి ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న గ్రామంలో ఉన్న దాదాపు 8 బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి ఈ బెల్ట్ షాపులను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు. ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.1
- తెలంగాణలో రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నీకు రక్తమే కావాలనుకుంటే, రైతుల కోసం మా రక్తాన్ని కూడా ధారపోస్తామంటూ హరీష్ రావు గారు స్పష్టం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.1
- జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.1
- తెలంగాణలో కరువు వస్తున్న నేపథ్యంలో పంటలకు, రైతులకు నీళ్ళు ఎలా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద సమాధానం ఇచ్చారు. ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.1