logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి • రాజకీయ విధ్వంసకుడు లిఖించిన నెత్తుటి చరిత్రకు ప్రతిరూపం అమరావతి : ప్రత్తిపాటి • చంద్రబాబు నిర్మిస్తున్నది కేవలం రాజధాని కాదు... ప్రపంచం గర్వించే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి • అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే : ప్రత్తిపాటి “ అమరావతికి చట్టబద్ధత... తెలుగు ప్రజల భవిష్యత్ కు చెక్కుచెదరని భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలపై ఉన్నతరిగిపోని నిబద్ధత.. ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల దేశ పాలకులకున్న నిజమైన కృతజ్ఞత. కూటమిప్రభుత్వ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వానికి చట్టబద్ధత. రైతుల హక్కులకు, మహిళల ఆశలకు, యువత లక్ష్యాలకు సమగ్ర ప్రతిఫలత. అమరావతి మా హక్కు.. మా భవిష్యత్. నా రాష్ట్ర ప్రజల హక్కుల ప్రతీక. భూములిచ్చిన రైతులతో పాటు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను కూటమి ప్రభుత్వం అమరావతిగా నిర్మిస్తోంది. అమరావతి కేవలం రాజధాని కాదు... 5 కోట్ల ప్రజల ఆశలు, ఆవేశాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవాల కలబోత. గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న మాటల్లో వర్ణించలేని హృదయవేదన. అమరావతి నగరం రైతుల చెమట.. మహిళల కన్నీరు.. ప్రజల కలలతో నిర్మితమవుతోందనేది జగమెరిగిన సత్యం.. జగన్ఎప్పటికీ గుర్తించలేని కఠోర వాస్తవం. అలాంటి విశ్వ నగరానికి చట్టబద్ధతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధర్మం, న్యాయం, చట్టం ప్రజల వైపే ఉన్నాయని చాటి చెప్పాయి. అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే. చంద్రబాబు అమరావతిని మాత్రమే నిర్మించడం లేదు.. ప్రపంచం గర్వించే, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించే గొప్ప ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిస్తున్నారు. *రాజకీయ విధ్వంసకుడి రక్త చరిత్రకు మరో రూపం..* అమరావతి విధ్వంసం లక్ష్యంగా సాగిన జగన్ పాలన... 5 కోట్ల ప్రజలకు మిగిల్చిన నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యం. మహిళల మానప్రాణాలపై రాక్షసమూకలు వేసిన అభాండాలు, అపనిందలకు, వాటిని ఎదుర్కొన్న వారి పోరాటపటిమకు ప్రతిరూపం.. త్యాగధనులైన భూమిపుత్రుల నెత్తుటి సిరాతో స్వార్థపరుడైన రాజకీయ విధ్వంసకుడు లిఖించిన రక్తచరిత్రకు మరో రూపం మా అమరావతి. *అమరావతిపై జగన్ వైఖరి.. ఏటి మల్లన్న, బోడిమల్లన్న తీరుగా ఉంది..* అధికారంలో ఉన్నప్పుడు పలురకాలుగా.. ప్రజల చేతిలో భంగపడ్డాక మరో తీరుగా మాట్లాడటం పచ్చి అవకాశవాది, అస్యతవాది.. అవినీతిపరుడైన జగన్ కే చెల్లింది. అమరావతిపై జగన్ చెప్పే కట్టుకథల్ని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. ప్రజా రాజధానిపై ఆయన వైఖరి ముమ్మాటికీ ఏటిమల్లన్న..బోడి మల్లన్న తీరుగానే ఉంది. కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించినందునే జగన్ రాజధానిపై గతంలో పాడిన రాగాన్నే కాస్త మార్చి పాడుతున్నాడు. *నాడు జగన్ కు ప్లాన్ లు.. ప్రతిపాదనలు గుర్తురాలేదా?* అమరావతి నిర్మాణంపై ఇప్పుడు ప్లాన్ లు.. ప్రతిపాదనలు అంటున్న జగన్ ఐదేళ్లపాటు.. ప్రజల ఆకాంక్షల్ని ఎందుకు పట్టించుకోలేదు? రైతుల త్యాగాల్ని అపహాస్యం చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు జగన్ కు రాజధాని ప్రణాళికలు గుర్తురాలేదా? గతప్రభుత్వం రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లను ఇతరులకు కేటాయించడమేనా జగన్ దూరదృష్టి చర్య? రాజధాని ప్రాంత మహిళల్ని వేశ్యలతో పోల్చిన సంస్కార హీనులు.. నేడు అమరావతికి అనుకూలమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం సిగ్గుచేటు. అవినీతి, అధికారం, దోపిడీ, ధన దాహాలపై తప్ప, మరే అంశంపైనా జగన్ కు స్పష్టత లేదనే నిజం ప్రజలు గ్రహించాలి. అమరావతి నిర్మాణ ఖ్యాతిని తనదిగా చెప్పుకునేందుకే మాజీసీఎం ‘జగన్నా’టకాలు మొదలెట్టాడు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

21 hrs ago
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago
f03bc6b1-dfae-4981-a21c-c445e0215d6a

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.
    1
    పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు
పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    29 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • Post by PSPK Shiva Jsp
    1
    Post by PSPK Shiva Jsp
    user_PSPK Shiva Jsp
    PSPK Shiva Jsp
    మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    1
    *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు*
*ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.
    3
    నకిరేకల్ మునిసిపాలిటీ:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు.
ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...
    2
    మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    51 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.