తెలంగాణ విద్యార్థి అమరుడు..జోహార్ సర్దార్ సిరిపురం యాదయ్య -సిరిపురం యాదయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి మలిదశ తెలంగాణ అమరవీరుడు సర్దార్ సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మరియు సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన యాదయ్య విగ్రహాన్ని ఓయూ ఎన్సిసి గేటు దగ్గర ఏర్పాటు చేయాలని, ఓయూ మెయిన్ గేటుకు సిరిపురం యాదయ్య పేరును పెట్టాలని, ఎన్సిసి గేటు ప్రాంగణం రోడ్డుకు యాదయ్య మార్గ్ అని నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోలేదని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించుకునేందుకు భవిష్యత్ తరాలకు అందించేందుకు వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎనుగంటి రాజు నేత, అవ్వారి వేణు, చేరాల వంశీ నేత, అమృతం కళ్యాణ్, ఉదయ్, శ్రీధర్ యాదవ్, దాసోజు కృష్ణమాచారి, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యార్థి అమరుడు..జోహార్ సర్దార్ సిరిపురం యాదయ్య -సిరిపురం యాదయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి మలిదశ తెలంగాణ అమరవీరుడు సర్దార్ సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మరియు సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన యాదయ్య విగ్రహాన్ని ఓయూ ఎన్సిసి గేటు దగ్గర ఏర్పాటు చేయాలని, ఓయూ మెయిన్ గేటుకు సిరిపురం యాదయ్య పేరును పెట్టాలని, ఎన్సిసి గేటు ప్రాంగణం రోడ్డుకు యాదయ్య మార్గ్ అని నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోలేదని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించుకునేందుకు భవిష్యత్ తరాలకు అందించేందుకు వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎనుగంటి రాజు నేత, అవ్వారి వేణు, చేరాల వంశీ నేత, అమృతం కళ్యాణ్, ఉదయ్, శ్రీధర్ యాదవ్, దాసోజు కృష్ణమాచారి, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
- తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- దౌల్తాబాద్ హత్నూర మండల్ సంగారెడ్డి జిల్లా గ్రామపంచాయతీ మోరీలు శుభ్రం చేయకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది ప్రజాధనాన్ని వృధా చేయడం మోరీలు వ్యర్ధాలు తీయకపోవడం ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.2
- *ఎల్.పి.జి.సిలిండర్ ధరల పెరుగుదల,కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీల నిరసన* *ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో పాల్గొన్న భువనగిరి లోక్ సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* *ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడటం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేపట్టలేదు* *ఎల్.పి.జి.సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి* *18 వ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదు* *ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోడీ అజెండాగా మారింది* *ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారు* *ట్రంప్ చర్యలను మోడీ ఎందుకు వ్యతిరేకించడం లేదు* *ట్రంప్ కు భారత ప్రధాన మంత్రి మోడీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం పరిస్థితులు,ప్రభావం పై నరేంద్రమోదీ పార్లమెంట్ లో మాట్లాడాలి*1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ జిల్లా జెడ్పీ కార్యాలయంలో *“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమం నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కార్యక్రమం... పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ... కార్యక్రమానికి రోడ్లు & భవనాల శాఖ మంత్రి *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* హాజరు.. జిల్లా కలెక్టర్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు పాల్గొన్నారు... కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేసిన మంత్రి... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలని సూచన... ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపు... పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి అవసరం... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం... *రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..*☝️1
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1