logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజ్యాధికారాన్ని లక్ష్యంగా చేసుకుని భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన 'రాజ్యాధికార సమరభేరి' బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 'హలో బీసీ.. చలో భువనగిరి' సభకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను పార్టీ జిల్లా అధ్యక్షులు తుప్పతి భిక్షపతి ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు యావత్ తెలంగాణలో వెనుకబడిన వర్గాల రాజ్యాధికారం వైపు అడుగులు వేసేందుకు ఈ సమరభేరిని సన్నద్ధం చేసినట్లు జిల్లా నాయకులు తెలిపారు. బహుజనుల హక్కుల సాధన కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కోసం భువనగిరి వేదికగా జరిగే ఈ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల, కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్, జిల్లా యూత్ అధ్యక్షులు పేర్ల కిషన్, విద్యార్థి విభాగం అధ్యక్షులు జంగా అశోక్, పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు మౌనిక, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మల్కి సంపత్ కుమార్, చిన్నకోడూర్ మండల అధ్యక్షులు పోచయ్య, మర్కూక్ మండల నాయకులు నరేష్, చందు, శైలజ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2 hrs ago
user_Puranam ranjith kumar
Puranam ranjith kumar
Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago
05e2650d-44b5-44bb-9f42-94dc903406e6

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజ్యాధికారాన్ని లక్ష్యంగా చేసుకుని భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన 'రాజ్యాధికార సమరభేరి' బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 'హలో బీసీ.. చలో భువనగిరి' సభకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను పార్టీ జిల్లా అధ్యక్షులు తుప్పతి భిక్షపతి ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు యావత్ తెలంగాణలో వెనుకబడిన వర్గాల రాజ్యాధికారం వైపు అడుగులు వేసేందుకు ఈ సమరభేరిని సన్నద్ధం చేసినట్లు జిల్లా నాయకులు తెలిపారు. బహుజనుల హక్కుల సాధన కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కోసం భువనగిరి వేదికగా జరిగే ఈ సభ

d62c52c0-6725-480b-accd-980706d2cdd8

ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల, కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్, జిల్లా యూత్ అధ్యక్షులు పేర్ల కిషన్, విద్యార్థి విభాగం అధ్యక్షులు జంగా అశోక్, పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు మౌనిక, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మల్కి సంపత్ కుమార్, చిన్నకోడూర్ మండల అధ్యక్షులు పోచయ్య, మర్కూక్ మండల నాయకులు నరేష్, చందు, శైలజ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    1
    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు.

కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.

వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    15 hrs ago
  • ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    1
    ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    2
    ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Financial Analyst కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు. "డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు.

"డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ విభజనను అగౌరవపరుస్తూ మాట్లాడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్యను తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఎంపీ తేజస్వి సూర్య ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనను రాష్ట్రంలోకి అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.
    1
    తెలంగాణ విభజనను అగౌరవపరుస్తూ మాట్లాడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్యను తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఎంపీ తేజస్వి సూర్య ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనను రాష్ట్రంలోకి అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు.

ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.