నల్గొండలో మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర.. రోడ్డు కబ్జా చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం నల్లగొండ బ్రేకింగ్: ఏకంగా రోడ్డుపై సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమా? రవీంద్రనగర్‌లో 24 ఫీట్ల రోడ్డు పై ఆక్రమ నిర్మాణం కలకలం.. స్పందించని అధికారులు.స్థానికుల ఆందోళన.. రోడ్డే కబ్జా చేస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం… నిద్రలో మున్సిపల్ అధికారులు.. పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని నగర టౌన్ ప్లానింగ్ అధికారులు... *పేదలకు ఒక న్యాయం, బలిసిన వారికి మరో న్యాయం?* రవీంద్రనగర్‌లో అధికారులపై పలు ఆరోపణలు.. రోడ్డుపై గుంతలు చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. అధికారులపై ప్రజల ఆగ్రహం విజయ గణపతి ఆలయం సమీపంలో పట్టపగలే రోడ్డు ఆక్రమణ.. అక్రమ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.. సెకండ్ సాటర్ డే, సండే హాలిడే ఉంది తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు... ఇదే కన్స్ట్రక్షన్ నిరుపేద వారు ఎవరైనా కడితే అధికారులు ఊరుకుంటారా! కన్స్ట్రక్షన్ ఆగేనా మూడుపుల మత్తులో అధికారులు చేతులు దులుపుకునేనా వేచి చూడాల్సిందే.!
నల్గొండలో మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర.. రోడ్డు కబ్జా చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం నల్లగొండ బ్రేకింగ్: ఏకంగా రోడ్డుపై సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమా? రవీంద్రనగర్‌లో 24 ఫీట్ల రోడ్డు పై ఆక్రమ నిర్మాణం కలకలం.. స్పందించని అధికారులు.స్థానికుల ఆందోళన.. రోడ్డే కబ్జా చేస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం… నిద్రలో మున్సిపల్ అధికారులు.. పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని నగర టౌన్ ప్లానింగ్ అధికారులు... *పేదలకు ఒక న్యాయం, బలిసిన వారికి మరో న్యాయం?* రవీంద్రనగర్‌లో అధికారులపై పలు ఆరోపణలు.. రోడ్డుపై గుంతలు చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. అధికారులపై ప్రజల ఆగ్రహం విజయ గణపతి ఆలయం సమీపంలో పట్టపగలే రోడ్డు ఆక్రమణ.. అక్రమ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.. సెకండ్ సాటర్ డే, సండే హాలిడే ఉంది తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు... ఇదే కన్స్ట్రక్షన్ నిరుపేద వారు ఎవరైనా కడితే అధికారులు ఊరుకుంటారా! కన్స్ట్రక్షన్ ఆగేనా మూడుపుల మత్తులో అధికారులు చేతులు దులుపుకునేనా వేచి చూడాల్సిందే.!
- నకిరేకల్, ఏప్రిల్ 13:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వార్తలోని ముఖ్యాంశాలు: 20 రోజులుగా నిరీక్షణ: ఐకేపీ కేంద్రాలకు రైతులు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేరుకు మాత్రమే ఒకటి రెండు సెంటర్లలో కొనుగోలు ప్రారంభించి, మిగిలిన చోట్ల తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పునరావాస కేంద్రాలు: గతంలో ధాన్యం కొనుగోళ్లు PACS (ప్యాక్స్) మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగేవని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కొత్త వారికి కేంద్రాలను కేటాయించిందని ఆరోపించారు.తరుగు పేరుతో దోపిడీ: అనుభవం లేని వ్యక్తులకు కేంద్రాలు అప్పగించడం వల్ల మిల్లర్లు ఆడుకుంటున్నారని, బస్తాకు (40 కేజీలు) 2 నుండి 4 కేజీల వరకు తరుగు తీయాలని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.మిల్లర్ల సిండికేట్: మిల్లర్లతో కుమ్మక్కై, లేని సాకులు వెతుకుతూ రైతుల రక్తాన్ని తాగుతున్నారని, క్వింటాకు భారీగా నష్టం వాటిల్లేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం స్పందించి రాజకీయ జోక్యం లేకుండా, పాత పద్ధతిలో అనుభవం ఉన్న సంఘాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని త చిరుమర్తి లింగయ్య గారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.1
- మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ విద్యతోనే వివక్షను జయించవచ్చని అంబేద్కర్ నిరూపించారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన సమానత్వమే నేటి స్వేచ్ఛకు పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- Post by Bandi renu1
- Post by Ali ammu1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.1