Shuru
Apke Nagar Ki App…
హుస్నాబాద్ : ప్రారంభమైన యాసంగి ముందస్తు వరి కోతలు......! హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేణు విలేకరి
హుస్నాబాద్ : ప్రారంభమైన యాసంగి ముందస్తు వరి కోతలు......! హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.4
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసాయి. ఏబీవీపీ జెండాలు, ప్రోటోకాల్ వివాదం కలకలం సృష్టించింది. అధికారులు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జయంతి వేడుకలు ఆందోళనలు నిరసనలు అరెస్టుల మధ్య సాగాయి. ప్రోటోకాల్ వివాదం, ఏబీవిపి జెండాలు లొల్లికి దారి తీశాయి ఏబీవీపీ జండాలతో అంబేద్కర్ విగ్రహానికి ఎబివిపి పూలమాలలు వేస్తుండగా దళిత సంఘాలు అభ్యంతరం తెలిపిపాయి. తాము దళితులమే అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఘాటుగా సమాధానం చెప్పడంతో దళితులకు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. పరస్పర నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బలవంతంగా వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. మరోవైపు వేదికపైకి దళిత సంఘాల ప్రతినిధులను పిలువలేదని నిరసన పలువురు దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. వేదిక పైకి దూసుకెళ్లి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, అధికారులను మాత్రమే వేదిక పైకి పిలిచామని రాద్ధాంతం చేయొద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సముదాయించి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.2