Shuru
Apke Nagar Ki App…
పురుషోత్తమయి గూడెం సమీపం లోని సీతారాం తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న కారు ఒకరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమమ్మాయిగూడెం సమీపంలోని సీతారాం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పురుషోత్తమ గూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం శుభకార్య నిమిత్తం ఆటోలో మహబూబాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో సీతారంతాండ స్టేజి సమీపంలో కొరివైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
Mogulagani Mahendar Mogulagani Mahendar
పురుషోత్తమయి గూడెం సమీపం లోని సీతారాం తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న కారు ఒకరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమమ్మాయిగూడెం సమీపంలోని సీతారాం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పురుషోత్తమ గూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం శుభకార్య నిమిత్తం ఆటోలో మహబూబాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో సీతారంతాండ స్టేజి సమీపంలో కొరివైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు సరైన ధర అందించడంలో కొనుగోలు కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా నిర్వహించడంతో పాటు తేమ శాతం 14% లోపే ఉండాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.2400 ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, చెల్లింపులు సమయానికి జరగాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్ యార్డ్‌లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా: కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి 300 మందిలో 101 మందిని షార్ట్‌లిస్ట్ చేసిన అధికారులు, అర్ధరాత్రి సమాచారంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి, అకస్మాత్తుగా పరీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. షార్ట్‌లిస్ట్ అయిన వారిలో కొందరికి మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగాయని, అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- #JaiDeshParty * #JaiDeshParty4Audit To Bring People Voice on #Telangana Govt Schemes Through Note1
- దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.4
- *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది1
- *ఉగాది పండుగ సందర్భంగా నాయకుల వాటాలు* కేతపల్లి గ్రామ పంచాయతీ అవినీతి చిట్టా అభివృద్ధి పేరిట కేతేపల్లి పెద్ద నాయకులు నిధుల స్వాహా! కేతపల్లి గ్రామ ప్రజలారా, మన గ్రామానికి వచ్చిన నిధులు ఎటు పోతున్నాయి? అభివృద్ధి అంటే కేవలం ఫోటోలకు ఫోజులివ్వడమేనా? మన పంచాయతీలో జరుగుతున్న అడ్డగోలు ఖర్చులను ఒక్కసారి గమనించండి. వీధి దీపాల (Street Lights) పేరుతో భారీ దోపిడీ: కేవలం రెండు నెలల వ్యవధిలో వీధి దీపాల కోసం రూ. 6,40,000/- ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే: మార్చి 17వ తేదీన: రూ. 2,08,317/- డ్రా చేశారు. మరుసటి రోజే (మార్చి 18న): మళ్ళీ రూ. 4,28,209/- డ్రా చేశారు. ఒక్క రోజు వ్యవధిలో లక్షల రూపాయల విలువ చేసే లైట్లు ఎక్కడ వేశారు? ఇది పచ్చి అవినీతి కాదా? నీటి సరఫరా మరియు పైపులైన్ మరమ్మతుల మాయాజాలం: గ్రామంలో నీటి సౌకర్యం కోసం కేటాయించిన నిధుల్లో కూడా భారీగా గోల్‌మాల్ జరిగింది: పైపులైన్ రిపేర్ల పేరుతో రూ. 1,63,000/- మరియు ఇతర వాటర్ వర్క్స్ కోసం రూ. 1,07,000/- కలిపి మొత్తం రూ. 2,70,000/- ఖర్చు చూపించారు. పనులు జరిగిన దాఖలాలు లేవు కానీ కాగితాల్లో మాత్రం లక్షల రూపాయలు మాయమయ్యాయి. పారిశుధ్యం (Sanitation) - డబుల్ ఖర్చు: గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నప్పటికీ, అదనంగా పారిశుధ్య పనుల పేరుతో రూ. 1,40,000/- ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? నిధుల దుర్వినియోగం: మన గ్రామానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా 20 లక్షల రూపాయలు, ఉపాధి హామీ (NREGS) కింద 10 లక్షల రూపాయలు వచ్చాయి. నిజమైన నాయకుడు బయట నుండి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి కానీ, వచ్చిన నిధుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు జేబులో వేసుకోవడం అభివృద్ధి అనిపించుకోదు.కేతపల్లి గ్రామ ప్రజల సొమ్మును అప్పనంగా తింటున్న కేతే పెళ్లికి చెందిన బడా బడా మేము అధికార పార్టీ నాయకులమని గ్రామ పంచాయతీ సొమ్మును వాటాల వారిగా దోచుకుంటూ అప్పనంగా తింటున్న వారందరి అందర్నీ వారిని నిలదీయాల్సిన సమయం వచ్చింది. అభివృద్ధి అంటే ఫోజులు కొట్టడం కాదు, నిజాయితీగా పని చేయడం. అంటే ఎన్ని రోజులు వాట్స్అప్ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతో పని చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టింది ఇందుకోసమేనా1
- వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది.. భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తశుద్ధిలేని పచ్చి అబద్దాల కూర్పుగా భావించవచ్చు.. రాజీవ్ యువవికాసం పేరుతో రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని బడ్జెట్లో ప్రస్తావిస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు వ్యవసాయ కూలీలకు ఒక్క రూపాయి బడ్జెట్ ద్వారా ఇవ్వడం లేదు.. గత రెండు బడ్జెట్లలో ప్రవేశపెట్టిన అంశాలనే మళ్లీ ప్రస్తావించారు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులైన దేవాదుల కు ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేని బడ్జెట్ ఇది రైతులను, వ్యవసాయ కూలీలను, కార్మికులను ఈ బడ్జెట్లో మోసం చేశారు.. సన్న వడ్లకు బోనస్ ప్రస్తావన లేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధినీ ఈ బడ్జెట్ నిరాశపరిచింది, ఏ ఒక్క హామీలు కూడా సంపూర్ణంగా నిధులు కేటాయించలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాతినిధ్యం వహీస్తున్న ఎమ్మెల్యేలు ,మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ బడ్జెట్ పైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ..1