Shuru
Apke Nagar Ki App…
భూ బాధితులకు న్యాయం చేస్తా: బీజేపీ మంత్రి ఈటల రాజేందర్ RR: శామీర్‌పేట్‌లోని తన నివాసంలో అన్మత్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల భూ బాధితులను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కలిసి వారి సమస్యలను విన్నారు. దళితులకు కేటాయించిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Ram Thotapally
భూ బాధితులకు న్యాయం చేస్తా: బీజేపీ మంత్రి ఈటల రాజేందర్ RR: శామీర్‌పేట్‌లోని తన నివాసంలో అన్మత్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల భూ బాధితులను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కలిసి వారి సమస్యలను విన్నారు. దళితులకు కేటాయించిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- బాలకృష్ణకు ఫోన్ చేసిన అభిమాని.నల్లమల రంజిత్ .VIDEO.... ఖమ్మం :ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఖమ్మం పట్టణానికి చెందిన అభిమాని నల్లమల రంజిత్ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రమాద సంఘటన తనతో పాటు అభిమానులను కలచివేసిందని రంజిత్ బాలయ్యకు వివరించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మరో 3 వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని దేవుడికి పూజ చేయించినట్లు రంజిత్ చెప్పగానే బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.2
- ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ3
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.1
- మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1