సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, పెట్రోలింగ్, ఇతర విధుల్లో సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా వారు సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వర్షాకాలంలో పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్ కోట్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రక్షణ పరికరాలు తదితరాలను అందుబాటులో ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ.ఆర్. డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్.ఐలు సంతోష్, శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.4
- తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..2
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1